టీడీపీ కి 'హరే'శరణం...!  

Chandrababu\'s Vision 2019 For Ntr Jr-

రాజకీయాల్లో చంద్రబాబు ని మించిన రాజకీయ మరొకడు లేదన్నది ఎవరు అవునన్నా కాదన్నా ఒప్పుకోవలసిన సత్యం…రాజకీయ అవసరాల దృష్ట్యా ఎవరితో ఎప్పుడు కలవాలో.ఎవరితో ఎప్పుడు ఎలా మాట్లాడాలో.ఎప్పుడు ఎలా మచ్చిక చేసుకోవాలో బాబు కి తెలిసినంతటి రాజకీయ లౌక్యం మరొకరికి తెలియదు. అయితే ఇప్పుడు ఇంత గొప్పగా చంద్రబాబు గురించి ఎందుకు చెప్పుకోవలసి వస్తోందంటే. రాబోయే రోజుల్లో టీడీపీ కి ప్రచారం చేయడానికి, సానుభూతి పొందటానికి తప్పకుండా జూనియర్ ఎన్టీఆర్ అండ కావాలి… .

టీడీపీ కి 'హరే'శరణం...!-Chandrababu's Vision 2019 For NTR Jr

అదే సమయంలో సెంటి మెంట్ కోసం హరికృష్ణ చావు కావాలి. అందుకే ఇప్పటి నుంచీ బాలయ్య ద్వారా తన వ్యూహాన్ని చంద్రబాబు అమలు చేస్తున్నారనేది పరిలీలకుల విశ్లేషణ…హరికృష్ణ సెంటిమెంట్ యాంగిల్ ని వాడుకోవడం ఈ ఎన్నికల సమయంలో ఎంతో కొంత ఉపయోగపడుతుందని భావించిన చంద్రబాబు బాలకృష్ణ ని అరవింద సమేత విజయోత్సవ వేడుకకి కి వెళ్ళమని చెప్పాడని అందుకే అక్కడ బాలయ్య తన అన్న హరికృష్ణ టీడీపీ కి చేసిన మేలు గురించి.పార్టీ కోసం, తన తండ్రి కోసం హరి కృష్ణ పడిన కష్టం గురించి చెప్పాడని అంటున్నారు.

హిందూపురం అభివృద్ధి కోసం తన అన్న ఎంతో కష్టపడ్డాడని బాలయ్య తెలిపారు..

అయితే ఇక్కడ గమనించవలసిన మరొక విషయం ఏమిటంటే.హరికృష్ణ చనిపోయాక ఆయన్ని ఇంతలా పొగిడేసిన బాలయ్య.

తన అన్నయ్య బతికుండగా ఎలా వ్యవహరించాడో ఎవరికి తెలియదు . పార్టీలో హరికృష్ణ ప్రాధాన్యాన్ని బాబు పూర్తిగా తగ్గించేసి ఆయన్ని అవమానాలకు గురి చేస్తే బాలయ్య ఆ సమయంలో ఎందుకు సైలెంట్ గా ఉన్నాడో అదే స్టేజి పై చెప్పి ఉంటే ఇంకా బాగుండేది కదా.

తన అన్న బ్రతికి ఉండగా ఎన్నడూ అన్న గురించి పాజిటివ్ గా ఒక్క మాట మాట్లాడింది లేదు. అసలు అన్న ప్రస్తావనే తెచ్చింది లేదు. ఇప్పుడు మాత్రం మా అన్నగారు అంటూ వినమ్రుడిలా యాక్టింగ్ లు చేస్తుంటే ఎవరికైనా చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇదంతా పొలిటికల్ ఎత్తుగడని.

ఇక్కడ కూడా తెలుగుదేశం పార్టీని హైలైట్ చేయడానికి ప్రయత్నించాడు బాలయ్య దీన్ని బట్టి చూస్తే బాలయ్య మాటలు వెనుకాల ఎవరు ఉన్నారో చాలా స్పష్టంగా అర్థమవుతుంది అంటున్నారు విశ్లేషకులు.