కష్టాల్లో బావయ్యా ... కనిపించని బాలయ్య ?

టిడిపి తో పాటు ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు ఇప్పుడు కష్టకాలమే నడుస్తోంది.వైసిపి ప్రభుత్వం బలంగా ఉండడంతో పాటు, జనాలోనూ ఆదరణ పెంచుకుంటూ వెళ్తుండటంతో , టిడిపి ఇబ్బందులు ఎదుర్కొంటోంది.

 Handrababus Troubles Are Due To Balakrishna Not Being Active In Tdp Nandamuri Ba-TeluguStop.com

  2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి, ఘోర పరాజయం పొందింది.అప్పటి నుంచి ఇబ్బందులు పడుతూ వస్తోంది .2024లో మాత్రం ఏదో ఒక పార్టీ తో పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్లాలని ప్రయత్నాల్లో ఉంది.అప్పటి వరకూ పార్టీ కేడర్ చెల్లా చెదురు కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత చంద్రబాబు పై పడడంతో, ఆయన తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు.

ఈ సమయంలో చంద్రబాబు తనయుడు లోకేష్ కాస్తో కూస్తో చేదోడు వాదోడుగా ఉంటున్నారు.కానీ చంద్రబాబు బావమరిది,  లోకేష్ మామ అయిన హిందూపురం టిడిపి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మాత్రం ఎక్కడా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు.

        2019 గెలిచిన దగ్గర నుంచి అడపాదడపా మాత్రమే నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు.  కానీ చాలా కాలం నుంచి ఆ నియోజకవర్గానికి వెళ్లడం లేదు .పార్టీ కార్యక్రమాలకు హాజరు కాకుండా కేవలం సినిమాలకే పరిమితం అయిపోయారు.ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నా, బాలయ్య పట్టించుకోనట్టు గా వ్యవహరిస్తున్నారు .బాలయ్య సొంత నియోజకవర్గమైన హిందూపురం లో తెలుగు తమ్ముళ్ళ మధ్య గ్రూపు తగాదాలు పెరిగిపోయినా, వాటిని పరిష్కరించేందుకు ఆసక్తి చూపించడం లేదు .అసలు చాలాకాలంగా హిందూపురం లో అడుగు పెట్టలేదు.ప్రస్తుతం టిడిపి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది .
   

Telugu Hindu Puram Mla, Hindupuram Tdp, Ysrcp-Telugu Political News

     మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు రకరకాల ఎత్తుగడలు రూపొందించుకుంది .త్వరలోనే బస్సు యాత్ర చేపట్టేందుకు చంద్రబాబు సిద్ధమవుతున్నారు .పార్టీ కేడర్ ను ఏకం చేసి అందర్నీ యాక్టీవ్ చేయాలని చూస్తున్నారు.  అయితే ఈ సమయంలో చంద్రబాబుకు అండగా బాలయ్య నిలబడి,  టిడిపిపై తరపున వాయిస్ వినిపిస్తూ టిడిపి రాజకీయ ప్రత్యర్థులపై విరుచుకుపడితే టిడిపిలో మరింత ఉత్సాహం వస్తుంది.అదీ కాకుండా వైసిపి కి రాయలసీమ ప్రాంతంలో గట్టిపట్టు ఉంది.

అలాగే బాలకృష్ణకు ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు.సరిగ్గా ఫోకస్ పెడితే రాయలసీమ ప్రాంతంలో టిడిపి గ్రాఫ్ పెరిగేలా చేయవచ్చు.

  కానీ ఆ విధంగా ఆయన ముందుకు వెళ్లకపోవడమే అటు చంద్రబాబు ఇటు టిడిపికి ఇబ్బందికరంగా మారింది.  పార్టీలో ఆయన పేరు తప్ప,  ఆయన వల్ల పార్టీకి ఏ మాత్రం ఉపయోగం లేదు అనే అభిప్రాయం పార్టీ నేతల్లో ఎక్కువగా కనిపిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube