వామ్మో చంద్రబాబు ప్లాన్ మామూలుగా లేదుగా... పాపం లోకేష్.. ఈ సారి కూడా..

Chandrababus Plan Is Not Normal Sadly Lokesh This Time Too

ఏపీ రాజకీయాల్లో తల పండిన మేధావి మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అనడంలో ఎటువంటి సందేహం లేదు.ఆయన చాలా రోజుల పాటు ఏపీకి సీఎంగా సేవలందించారు.

 Chandrababus Plan Is Not Normal Sadly Lokesh This Time Too-TeluguStop.com

ఉమ్మడి ఏపీ నుంచి తెలంగాణ, నవ్యాంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత కూడా ఒక పర్యాయం ఆయన సీఎంగా పని చేశారు.కానీ 2019 ఎన్నికల్లో ఆయన పార్టీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.

ఇక అప్పటి నుంచి ఆయన యాక్టివ్ పాలిటిక్స్ కు దూరంగా ఉంటున్నారు.ఆయన తనయుడు లోకేష్ చాలా యాక్టివ్ గా ఉంటూ వచ్చారు.

 Chandrababus Plan Is Not Normal Sadly Lokesh This Time Too-వామ్మో చంద్రబాబు ప్లాన్ మామూలుగా లేదుగా… పాపం లోకేష్.. ఈ సారి కూడా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఒక సమయంలో ఇక టీడీపీకి హెడ్ లోకేషే అనేంతగా ఆయన చేసే రాజకీయాలు వచ్చాయి.

లోకేష్ కూడా తన యంగ్ టీంను ఏర్పాటు చేసుకుని ముందుకు సాగారు.2019 ఎన్నికల్లో ఒక వేళ పార్టీ గెలిస్తే లోకేషే సీఎం అయ్యే వారట.కానీ దురదృష్టవశాత్తు ఆయన పార్టీ ఓడిపోయింది.

ఆయన కూడా మంగళగిరి నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు.ఇక ఇప్పుడు కూడా ఆయన అక్కడి నుంచే బరిలోకి దిగే సూచనలు కనిపిస్తున్నాయి.

ఇదిలా ఉంటే ప్రస్తుతం చంద్రబాబు వేసిన ప్లాన్ తో అధికార వైసీపీ పార్టీకి ముచ్చెమటలు పడుతున్నాయి.ఇంతకీ బాబు వేసిన ప్లాన్ ఏంటంటే.

ఆ మధ్య టీడీపీ పార్టీని ఇక నుంచి అంతా లోకేషే చూసుకుంటాడని టాక్ నడిచింది.అందుకు అనుగుణంగానే లోకేష్ కూడా ఆరోపణలతో హీటెక్కించారు.కానీ ఆ తర్వాత ఇప్పుడెందుకో లోకేష్ చాలా సైలెంట్ అయ్యారు.ప్రస్తుతం చంద్రబాబు యాక్టివ్ అయ్యారు.ఆయన జిల్లాల పర్యటనలు చేస్తూ కార్యకర్తల్లో జోష్ నింపేందుకు ప్రయత్నిస్తున్నారు.ఎలాగైనా సరే 2024 ఎన్నికల్లో గెలవాలని ఇప్పటి నుంచే ప్రయత్నాలు షురూ చేశారు.

ఒక వేళ 2024లో టీడీపీ అధికారంలోకి వచ్చినా కూడా తనే ఏపీకి ముఖ్యమంత్రిగా ఉంటానని ప్రజలకు వివరిస్తూ వస్తున్నారు.

#TDP #AP Poltics #Ysrcp #YS Jagan #Chandrababu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube