చంద్రబాబుని సొంత నియోజకవర్గం ప్రజలే నమ్మట్లేదు సజ్జల సంచలన కామెంట్స్..!!

వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి.చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

 Chandrababus Own Constituency People Do Not Believe Sajjala Sensational Comments-TeluguStop.com

పరిషత్ ఎన్నికల లో వైసీపీ పార్టీ భారీ స్థాయిలో ఘన విజయం సాధించడంతో.దాదాపు రాష్ట్రవ్యాప్తంగా 98 శాతానికి పైగా స్థానాల్లో గెలవడం తెలిసిందే.

ఈ క్రమంలో అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఏకంగా 18 శాతం ఓట్లు సాధించడం జరిగింది.ఇదిలా ఉంటే ఇప్పుడు ఏకంగా 45 శాతం ఎక్కువ ఓట్లు.

 Chandrababus Own Constituency People Do Not Believe Sajjala Sensational Comments-చంద్రబాబుని సొంత నియోజకవర్గం ప్రజలే నమ్మట్లేదు సజ్జల సంచలన కామెంట్స్..-Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

వైసీపీకి రావడం జరిగింది.ఇటువంటి తరుణంలో ఏపీలో జగన్ పార్టీకి తిరుగులేకుండా పోయింది అనే విశ్లేషణలు వస్తూ ఉన్నాయి.

ఇటువంటి తరుణంలో వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి.వైసీపీ పార్టీని ఇంతగా ప్రజలు ఆదరించడానికి గల కారణం.జగన్ అమలు చేస్తున్న సంక్షేమ కారణాలే అని తెలిపారు.

పరిషత్ ఎన్నికలలో ప్రజలు ఇచ్చిన విజయంతో.

ప్రజలపై మరింత భారం పెరిగింది అని తెలియజేశారు. జడ్పీటీసీ ఎన్నికల్లో 69.55 శాతం, ఎంపీటీసీ ఎన్నికల్లో 64.8 శాతం ఓట్లు తమకు వచ్చాయని తెలిపారు.ఈ క్రమంలో చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం ప్రజలు కూడా ఆయన ని నమ్మే స్థితిలో లేరని.సజ్జల విమర్శించారు.పరిషత్ ఎన్నికలలో వైసీపీ సాధించిన విజయం దేశ రాజకీయాలలో రికార్డుగా చెప్పవచ్చని అభివర్ణించారు.తెలుగుదేశం పార్టీ ఎన్ని విమర్శలు చేసినా గాని ప్రజలు పట్టించుకోవడంలేదని.

ఇప్పటికైనా చంద్రబాబు ఆత్మవిమర్శ చేసుకుని రాజకీయాలు చేయాలని.సూచించారు.

వైసీపీ పార్టీ పదవుల కేటాయింపుల విషయంలో అన్ని వర్గాలకు సమన్యాయం చేస్తుందని స్పష్టం చేశారు.

#Chandrababu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు