ఎన్టీఆర్ కి భారతరత్న అంటూ చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..!!  

Chandrababu,Ntr,Tdp,Bharata ratna - Telugu Bharata Ratna, Chandrababu, Ntr, Tdp

ఎన్టీఆర్ 25 వ వర్ధంతి సందర్భంగా టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏపీ ప్రతిపక్ష నేత టీడీపీ అధినేత చంద్రబాబు నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ తెలుగు జాతి గర్వించదగ్గ వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు.

కేంద్ర ప్రభుత్వం ఆయన చేసిన సేవలు గుర్తించి భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఇప్పటికే లేట్ అయిందని.

ఖచ్చితంగా ఆయనకు భారతరత్న వచ్చే వరకు పోరాడుతాం అంటూ పేర్కొన్నారు.

అంతేకాకుండా త్వరలో ఆయన 100వ పుట్టినరోజు కూడా వస్తుందని ఆ లోపు ఆయనకు భారతరత్న వచ్చేలా కృషి చేస్తామని చెప్పుకొచ్చారు.తెలుగు రాజకీయాలకు వన్నె తెచ్చిన వ్యక్తి ఎన్టీఆర్ అని స్పష్టం చేశారు.దేశంలోని అన్ని రాజకీయ పార్టీలను ఏకతాటి పైకి తీసుకొచ్చిన ఏకైక వ్యక్తి ఆయనే అని తెలిపారు.

ఎన్టీఆర్ పేరు చెబితే శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెడతాయి అని తెలిపారు.ఆయన ఒక యుగపురుషుడు.ఆయన సృష్టించిన చరిత్ర మరెవ్వరు సృష్టించ లేరని ఎన్టీఆర్ ని చంద్రబాబు పొగడ్తలతో ముంచెత్తారు.ఎన్టీఆర్ 25వ వర్ధంతి కార్యక్రమం టీడీపీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబుతో పాటు పార్టీకి చెందిన కీలక నాయకులు కూడా నివాళులు అర్పించారు.

  

#Chandrababu #Bharata Ratna

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు