జగన్ ను ఆడేసుకున్న బాబు ? ఎంతగా అంటే ?  

Chandrababu Ys Jagan Video Conference - Telugu Ap Govt, Chandrababu, Corona Effect, Lg Gas Leakage, Video Conference, Ys Jagan

ఏపీ సీఎం జగన్ వ్యవహరిస్తున్న తీరుపై కొద్దిరోజులుగా ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే.జగన్ తాను చెప్పిందే తప్ప ఎవరు ఏం చెప్పినా పట్టించుకోను అన్నట్టుగా ముందుకు వెళ్తుండడంపై విమర్శలు తీవ్ర స్థాయిలో వస్తున్నాయి.

 Chandrababu Ys Jagan Video Conference

ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న వారి విషయంలోనూ జగన్ కఠినంగా వ్యవహరిస్తున్నారు.దీనిపై ప్రజల్లో పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

అయినా ఏ విషయాలను పట్టించుకోనట్టు గా జగన్ ముందుకు వెళ్తున్నారు.తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు జగన్ వ్యవహారశైలిపైన, ఏపీ ప్రభుత్వం తీరుపైన తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

జగన్ ను ఆడేసుకున్న బాబు ఎంతగా అంటే -Political-Telugu Tollywood Photo Image

పార్టీ ముఖ్య నాయకులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు ఈ సందర్భంగా ప్రభుత్వం పైన, జగన్ పైనా విమర్శలు చేశారు.

ప్రస్తుతం కరోనా కట్టడి విషయంలోనూ విశాఖ ఎల్ జి కంపెనీలో విష వాయువు లీకైన సంఘటనలోనూ, ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ప్రజల దృష్టిని మరల్చేందుకు జగన్ పోతిరెడ్డిపాడు అంశాన్ని తెరపైకి తెచ్చారని, ప్రజలను, ప్రతిపక్షాలను డైవర్ట్ చేసి రాజకీయంగా విమర్శలు రాకుండా ప్లాన్ చేసుకున్నారని బాబు మండిపడ్డారు.

ఈ విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్, జగన్ ఇద్దరూ కలిసి నాటకాలు ఆడుతున్నారని, చంద్రబాబు మండిపడ్డారు.కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే రెండు తెలుగు రాష్ట్రాలు ఇండియా పాకిస్తాన్ లా మారుతాయని గతంలో దీక్ష చేసిన జగన్ అవన్నీ మర్చిపోయి ఆ ప్రాజెక్టు ఓపెనింగ్ కు వెళ్లడమే కాకుండా, కేసీఆర్ను పొగడ్తలతో ముంచెత్తారు అనే విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు.

ఏపీలో ఇప్పుడు జగన్ కు రాజకీయంగా ఇబ్బందులు తలెత్తడంతో ఈ విధంగా నదీజలాల అంశాన్ని తెరపైకి తెచ్చారన్నారు.ఇక కరోనా వైరస్ కు సంబంధించి వైసీపీ నేతలు ఒక్కొక్కరు ఒక్కోరకంగా మాట్లాడుతున్నారని, ఈ విషయంలో ఆ పార్టీ నాయకులు ఎవరికీ క్లారిటీ లేదని, వారి వ్యవహారం చూస్తుంటే అసలు తెలుగుదేశం పార్టీ కరోనా తెచ్చిందని విమర్శలు చేస్తారేమోనని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఏపీ ప్రభుత్వం తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ప్రతిపక్షాలపై ఎదురుదాడి చేస్తున్నాయని, తమకు అడ్డు వచ్చిన వారిపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని, ఇళ్ల పట్టాల ముసుగులు పెద్ద ఎత్తున భూ కుంభకోణానికి పాల్పడినట్టుగా చంద్రబాబు విమర్శించారు.జగన్ వ్యవహారశైలి చూస్తుంటే ఆయన తాత రాజారెడ్డి దారిలోనే ఆయన వెళుతున్నట్లుగా కనిపిస్తున్నారని, చట్టాలంటే లెక్క లేనట్టుగా వ్యవహరిస్తున్నారని, అందుకే కోర్టుల్లో వైసీపీ ప్రభుత్వానికి అడుగడుగునా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి అని చంద్రబాబు చెప్పుకొచ్చారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Chandrababu Ys Jagan Video Conference Related Telugu News,Photos/Pics,Images..