కాసేపటిలో రాజమండ్రి జైలు నుంచి బయటకు రానున్న చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబు మరికాసేపటిలో రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బయటకు రానున్నారు.

ఈ క్రమంలో చంద్రబాబుకు ఘన స్వాగతం పలికేందుకు జైలు వద్దకు టీడీపీ శ్రేణులు భారీగా చేరుకుంటున్నారు.

దీంతో రాజమండ్రి సెంట్రల్ జైలు ఎదుట స్వల్ప తొక్కిసలాట జరిగిందని తెలుస్తోంది.జైలుకు ఇరువైపులా పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను కార్యకర్తలు తోసుకుని వెళ్లేందుకు ప్రయత్నించారు.

ఈ క్రమంలో టీడీపీ శ్రేణులను అదుపు చేసేందుకు పోలీసులు అడ్డుకుంటున్నారు.దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

కాగా ఇప్పటికే చంద్రబాబు కాన్వాయ్ జైలు లోపలికి వెళ్లిందని సమాచారం.

Advertisement
ఇదేందయ్యా ఇది.. కోవిడ్ 19 థీమ్‌తో పార్కు.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..

తాజా వార్తలు