రెండు చోట్ల నుంచి పోటీ చేయ‌బోతున్న చంద్ర‌బాబు.. ఆ ప్రాంతంపై ఫోక‌స్‌

కంచుకోట‌కు బీట‌లు వారింది.త‌న సామ్రాజ్యం అనుకున్న చోటే ఆయ‌న‌కు ఎదురు దెబ్బ‌లు త‌గులుతున్నాయి.ద‌శాబ్ధాలుగా ఏలుతున్న నియోజ‌క‌వ‌ర్గం ఆయ‌న చేజారిపోతోంది.ఈ ప‌రాభ‌వం పార్టీ ఓడిపోవ‌డం క‌న్నా పెద్ద‌ద‌నే చెప్పాలి.ఎందుకంటే ఆయ‌నే ఓడిపోతే ప‌రిస్థితి ఏంటి అనేది త‌మ్ముళ్ల‌ను టెన్ష‌న్ పెడుతోంది. నారా చంద్ర‌బాబు అంటే అప‌ర చాణ‌క్యుడిగా పేరు సంపాదించుకున్న వ్య‌క్తి.

 Chandrababu Who Is Going To Compete From Two Places .. Focus On That Area, Chand-TeluguStop.com

మొద‌టి నుంచి త‌న వ్యూహాల‌తోనే ప్ర‌త్య‌ర్థుల‌ను దెబ్బ‌కొట్టి అధికారాన్ని ద‌క్కించుకున్న దిట్ట‌.ఒకానొక స‌మ‌యంలో దేశ రాజ‌కీయాల‌ను శాసించే స్థాయిలో ఉన్నారు.

అలాంటిది ఇప్పుడు సొంత నియోజ‌క‌వ‌ర్గం అయిన కుప్పంలోనే త‌న స‌త్తా చాటలేక‌పోతున్నారు.వ‌రుస‌గా జ‌రుగుతున్న అన్ని ఎన్నిక‌ల్లోనూ ఓడిపోతూనే ఉన్నారు.కుప్పం అంటే చంద్ర‌బాబుకు రెండు ద‌శాబ్దాలుగా బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్న కోట‌.అలాంటి చోట ఆయ‌న దారుణంగా ఓడిపోతున్నారు.

ఎన్ని మార్పులు చేసినా, ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్నా ఆయ‌న‌కు ఓట‌మి త‌ప్ప‌ట్లేదు.ఇప్పుడు కుప్పంలో జ‌రిగిన మున్సిప‌ల్ ఎన్నిక‌లు రాష్ట్రం మొత్తం హాట్ టాపిక్ అయ్యాయి.

ఇక్క‌డ వైసీపీ గెలుస్తుందా లేక చంద్ర‌బాబు గెలుస్తారా అని అంతా ఎదురు చూశారు.

Telugu Ap, Chandrababu, Cm Jagan, Ysrcpp-Telugu Political News

చంద్ర‌బాబు ప్ర‌భావం ఏ మాత్రం సీట్ల‌ను తీసుకురాలేదు.దీంతో ఆయ‌న భ‌విష్య‌త్ లో కుప్పం కాకుండా మ‌రో చోట నుంచి కూడా పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారంట‌.ముఖ్యంగా కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ లేదంటే పెనమలూరు నియోజ‌క‌వ‌ర్గాల్లో ఏదో ఒక దాని నుంచి చంద్ర‌బాబు పోటీ చేసేందుకు ఇప్ప‌టి నుంచే ప్లాన్ చేసుకుంటున్నారంట‌.ఇక్క‌డ రెండు చోట్లా వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నా.

వారి మీద వ్య‌తిరేక‌త ఉంద‌ని చంద్ర‌బాబు అంచ‌నా వేస్తున్నారు.కుప్పంతో పాటు ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో చంద్ర‌బాబు పోటీ చేయ‌బోతున్నార‌ని టాక్‌.

చూడాలి మ‌రి చంద్ర‌బాబు వైసీపీ దూకుడును ఎలా ఎదుర్కునేందుకు ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube