మొత్తం మీరే చేశారు ! వారిపై బాబు ఆగ్రహం ?

ఏపీని ఎన్నిరకాలుగా అభివృద్ధి చేయాలో అన్నిరకాలుగా అభివృద్ధి చేశాం ! ఆర్థికంగా ఎంత లోటు బడ్జెట్ ఉన్నా అనేక ప్రజాసంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజలు ఎక్కడా ఇబ్బందిపడకుండా చూసుకున్నాం.ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం చేయనంత స్థాయిలో ఏపీని అభివృద్ధి చేస్తే, ఇప్పుడు ఏపీలో తెలుగుదేశం పార్టీకి ఇంత దారుణమైన పరిస్థితి వస్తుందని ఊహించలేదని దీనంతటికి కారణం మన పార్టీ నాయకులు చేసిన అవినీతే కారణమని బాబు పార్టీలోని కొంతమంది కీలక నాయకుల వద్ద ఆగ్రహం వ్యక్తం చేశారట.

 Chandrababu Warth-TeluguStop.com

పార్టీ విజయావకాశాలపై అమరావతిలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, శాసనసభ, లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులతో నిర్వహించిన సమావేశంలో బాబు ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది.

బాబు తెప్పించుకున్న కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఈ ఎన్నికల్లో ఓటమి చెందుతామనే విషయాన్ని ముందే గ్రహించి ఈ వ్యాఖ్యలు చేస్తున్నట్టు పార్టీ నాయకులు గుసగుసలాడుకుంటున్నారు.

పార్టీ విజయం కోసం తాను అన్ని రకాలుగా కష్టపడ్డానని, మహిళలను, రైతులను ఆకట్టుకునేందుకు కొత్త కొత్త పథకాలు తీసుకు వచ్చానని, అయినా సొంత పార్టీ నేతల తప్పిదాల వల్ల ఈ పరిస్థితి తలెత్తుతుందని నేను ఊహించలేకపోయానని బాబు ఆవేదన వ్యక్తం చేసాడట.టీడీపీ ప్రభుత్వ పరిపాలనా కాలంలో టీడీపీ ప్రజాప్రతినిధులు అంతా అవినీతికి పాల్పడటం, ఎన్నికలను చిన్న చూపు చూడడం వంటి కారణాలవల్ల ఓటమి పాలవుతున్నామని బాబు తేల్చేశారట.

మనం ఎంత అబిరుద్ది చేసినా ప్రజల్లోకి ధైర్యంగా వెళ్లలేకపోయామని, కానీ ఈ విషయంలో ప్రతోపక్ష వైసీపీ సక్సెస్ అయ్యిందని, ఓటర్లను ఆకట్టుకునేలా అనేక కార్యక్రమాలు చేపట్టిందని బాబు చెప్పుకొచ్చారట.తిరిగి అధికారంలోకి వస్తే కొన్ని పథకాలను నిలిపివేస్తామని ప్రచారం జరగడంతో ఓటర్లు టీడీపీ మీద ఆగ్రహం వ్యక్తం చేసినట్టు కూడా బాబు కి అందిన రిపోర్ట్స్ లో స్పష్టంగా ఉందని తెలుస్తోంది.అదీ కాకుండా జనసేన ప్రభావం కూడా కొత్త ఓటర్లపై ఎక్కువగా పడిందని, యువతీ యువకులు జనసేనకు మద్దతు పలకడం టీడీపీ ఓట్లు కూడా భారీగా చీలి వైసీపీకి కలిసొచ్చినట్టు బాబు అంచనా వేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube