ఆ ఎమ్మెల్యేల‌ను బాబు భ‌య‌పెడుతున్నారా...     2018-06-23   00:00:12  IST  Bhanu C

మ‌రో ప‌ది మాసాల్లో రాష్ట్రంలో ఎన్నిక‌లు ఉన్నాయి. చంద్ర‌బాబు వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నాడు. ముఖ్యంగా కొంద‌రు నేత‌లు పార్టీ లో ఉండి కూడా ప్ర‌యోజ‌నం లేద‌ని అలాంటి వారిని వ‌దిలించుకోవాల‌ని ఆయ‌న నిర్ణ‌యించుకు న్నారు. ఈ క్ర‌మంలోనే కొన్నాళ్లుగా ఆయ‌న స‌ర్వే అంటూ ఊద‌ర‌గొడుతున్నారు. స‌ర్వేలో మార్కులు స‌రిగా రాక‌పోతే.. వారి భ‌ర‌తం ప‌డ‌తానంటూ.. బాబు ఎగిరి ప‌డుతున్నారు. ఇక‌, అయినా కూడా ఎమ్మెల్యేలు లైన్‌లోకి రాలేదు. దీంతో బాబు ప్లేట్ ఫిరాయించారు. తాను ఏరేయాల‌ని నిర్ణ‌యించుకున్న నేత‌ల‌కు స్వ‌యంగా తానే ఫోన్ చేస్తాన‌ని చెప్పుకొచ్చారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న జిల్లాల వారీగా పార్టీ స‌మ‌న్వ‌య క‌మిటీల‌తో స‌మావేశ‌మ‌వుతున్నారు.

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీపై పట్టు బిగించాల‌ని బాబు నిర్ణ‌యించుకున్నారు. రోజుకు నాలుగు నుంచి అయిదు గంటల పాటు ఉండవల్లిలోని తన నివాసం పక్కనే ఉన్న పరిష్కార వేదికలో పార్టీ పనులపై వివిధ నేతలతో సమావేశం అవుతున్నారు. పార్లమెంటరీ నియోజకవర్గాల సమీక్షలు ముగియగానే అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్షలను ప్రారంభించనున్నారు. ఈలోపు పార్టీ వ్యూహకమిటీలతో కూడా చంద్రబాబు సమావేశం అవుతున్నారు. ప్రతిరోజూ ఉదయం పరిష్కార వేదికలో పార్టీ అంశాలపై చర్చిస్తున్నారు. ప్రతిపక్షాల వ్యూహానికి ప్రతివ్యూహం రూపొందించుకుంటున్నారు. మంత్రులు..ఎమ్మెల్యేలు.. ఎంపీలు… జిల్లా పార్టీ అధ్యక్షులు.. ఇన్‌ఛార్జ్‌లు.. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తున్నారు.