ఆ.. 'మైక్' పై 'బాబు' ఆగ్రహం ! ఇకపై ప్రెస్ మీట్ లు కట్  

  • విశాఖ ఎయిర్ పోర్ట్ లో వైసీపీ అధినేత జగన్ పై జరిగిన కత్తి దాడి తర్వాత వైసీపీ నేతలు ఒక రేంజ్ లో టీడీపీ టిడిపి పై రెచ్చి పోయి మరి ప్రకటన చేశారు. అయితే ఈ పరిణామాలన్నీ టీడీపీకి బాగా కలిసి వచ్చాయి. అయితే ఆ తరువాత వైసీపీ నేతలు కొంచెం మెత్తబడినా టీడీపీ నేతలు ప్రతి దాడితో వైసీపీ ని ఇరుకున పెట్టాలనుకున్నారు . ఈ సమయంలో టిడిపి ఎమ్మెల్సీ వై వి రాజేంద్రప్రసాద్ మీడియా ముందు జగన్ పై ఆయన కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. జగన్ పై జరిగిన దాడికి జగన్ తల్లి విజయమ్మ, సోదరి షర్మిల ఉన్నారని రాజేంద్ర ప్రసాద్ ఆరోపించారు.

  • Chandrababu Warms Babu Rajendra Prasad Ask Not To Talk With Media-

    Chandrababu Warms Babu Rajendra Prasad Ask Not To Talk With Media

  • దీంతో ఒక్కసారిగా టీడీపీ పై జనాలకి అనుమానాలు మొదలయ్యాయి. దీనిపై చంద్రబాబు నాయుడు రాజేంద్ర ప్రసాద్ కు గట్టిగా వార్నింగ్ ఇచ్చారట. ఇకపై నీవు మీడియా ముందు మాట్లాడడానికి కుదరదు అని హెచ్చరించారు అట. జగన్ పై దాడి ఘటనలో వైసిపి నాయకులు చేస్తున్న విమర్శలకు నువ్వు చేసిన విమర్శలకు పెద్ద తేడా ఏముంది. జగన్ కుటుంబ సభ్యులను ఈ వ్యవహారంలో తీసుకురావాల్సిన అవసరం ఏంటని మండిపడ్డారట. ఇకపై తనకు తెలియకుండా టీవీ ఛానల్ చర్చ కార్యక్రమాలకు గాని ప్రెస్ మీట్ లు గాని పెట్టవద్దని గట్టిగా హెచ్చరించినట్టు సమాచారం.