బుద్ధుడిపై చంద్రబాబు అపార ప్రేమ

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి తన మామ ఎన్టీఆర్‌ లక్షణం ఒకటి వచ్చింది.అది…బుద్ధుడిపై ప్రేమ.ఎన్టీఆర్‌ హైదరాబాదులోని హుస్సేన్‌ సాగర్‌ మధ్యలో భారీ బుద్ధ విగ్రహాన్ని ప్రతిష్టించారు.ఇది అతి పెద్ద ఏకశిలా విగ్రహం.ఈ విగ్రహాన్ని ప్రతిష్టించిన తరువాత నగరానికి అందం, ఆకర్షణ పెరిగాయి.హైదరాబాద్‌ పేరు చెప్పగానే చార్మినార్‌తో పాటు ఈ బుద్ధ విగ్రహం కూడా గుర్తుకు వస్తుంది.

 Chandrababu Wants Rare Buddhist Sculptures Back From Uk-TeluguStop.com

ఇది ఇదో ఐకాన్‌ అన్నమాట.బాబు ఏపీకి ముఖ్యమంత్రి అయ్యాక, విజయవాడ-గుంటూరు మధ్య రాజధాని నిర్మాణం చేయాలని అనుకున్న తరువాత, దానికి అమరావతి అని పేరు పెట్టిన తరువాత ఆయన దృష్టి బుద్ధుడి మీదకు పోయింది.

ఆ ప్రాంతమంతా ఒకప్పుడు బౌద్ధ మతం విరాజిల్లింది.తెలంగాణలోనూ బౌద్ధం వెలిగిపోయిందనుకోండి.

అది వేరే విషయం.రాజధాని ప్రాంతం బౌద్ధం విలసిల్లిన ప్రాంతం కాబట్టి దీన్ని బౌద్ధ మతానికి కేంద్రంగా చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు.

అమరావతి బౌద్ధులకు ఎంతో పవిత్రమైంది కూడా.ఇదంతా ఆలోచించిన బాబు మన దేశం నుంచి బ్రిటిషువారు దోచుకుపోయిన అపురూపమైన బుద్ధుడి విగ్రహాలను తిరిగి తెప్పించాలని నిర్ణయించారు.

లండన్‌లో డెబ్బయ్‌ బుద్ధుడి విగ్రహాలు ఉన్నాయట.వాటిని తెచ్చి అమరావతిలో పెట్టాలని ఆయన ప్లాను.

ఈ విషయమై కేంద్రంతో మాట్లాడాలని పర్యాటక శాఖ అధికారులను ఆదేశించారు.బాబుది గొప్ప ఆలోచన.

కాని తెల్లవారు వాటిని తిరిగి ఇస్తారా? డౌటే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube