Chandrababu Wants Jr.NTR For Party Campaign

జూనియర్ ఎన్టీఆర్.సీనియర్ ఎన్టీఆర్ కి ఏ మాత్రం తీసిపోని అచ్చమైన రూపం.

 Chandrababu Wants Jr.ntr For Party Campaign-TeluguStop.com

ఒక్కొ సారి సినియర్ ఎన్టీఆర్ ని చూస్తున్నామా అన్నట్టుగా ఉంటుంది.నటనలో ,నృత్యంలో, హావభావాలలో తనదైన రీతిలో ప్రేక్షకులని ఆకట్టుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చికున్న హీరో.

టాప్ హీరోల లిస్టు లో అతి తక్కువ కాలంలో చేరిన ఘనత జూ.ఎన్టీఆర్ కి దక్కుతుంది.తన తాత గారు స్థాపించిన తెలుగు దేశం పార్టీ అంటే తనకు ఎంతో అభిమానం.అందుకే తెలుగుదేశానికి ఎన్నికల టైం లో ప్రచారం కూడా చేశారు.తరువాత చంద్రబాబు ఎన్టీఆర్ ని పక్కకు పెట్టడం.ఎన్టీఆర్ కూడా ముభావంగా ఉండటం ఇవన్నీ తెలిసిన విషయాలే

అయితే ఇప్పుడు ఒక విషయం సోషల్ మాధ్యమాలలో రచ్చ రచ్చ చేస్తోంది.2014 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు జూనియర్ ని అస్సలు పట్టించుకోవడం లేదు అంటూ వార్తలు హల్చల్ చేశాయి.అసలు ఏమి జరిగింది అనేది పక్కన పెడితే చంద్రబాబు జూనియర్ ఎన్టీఆర్ మధ్య దూరం పెరిగింది అనేది వాస్తవమే…మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో చంద్రబాబు మళ్ళీ జూనియర్ కోసం స్కెచ్ వేశాడు అనేది వాస్తవం.

జూనియర్ ఎన్టీఆర్ ఉత్తమ నటుడిగా నంది అవార్డు ప్రకటించడం ఫ్యూచర్ ని దృష్టిలో పెట్టుకుని జరిగింది అని టాక్

ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఈ సారి జనసేన అధ్యక్షుడిగా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటున్నాడు.కాబట్టి తెలుగుదేశం ప్రచారానికి ఇప్పుడు స్టార్ ఒకరు కావాలి.

అందుకే మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ కోసం ఈ ఉత్తమ నటుడి అవార్డుతో చంద్రబాబు గేలం వేశారు అని తెలుస్తోంది.నంది అవార్డుల వేదిక మీద జూనియర్ కి అత్యంత ప్రాధాన్యతని ఇచ్చేలా చేసి.

అక్కడి నుంచీ మళ్ళీ తమ భందాన్నికొనసాగించాలి అనేది చంద్రబాబు ప్లాన్ అంటున్నారు విశ్లేషకులు మరి.చంద్రబాబు ట్రాప్ లో జూనియర్ పడతాడా.జూనియర్ టిడిపికి మళ్ళీ ప్రచారం నిర్వహిస్తారా అనేది ముందు ముందు తెలియాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube