రంగంలోకి లింగమనేని ? టీడీపీ జనసేన పొత్తు పొడిచేనా ? 

ఒకపక్క జనసేన- బీజేపీ పొత్తు ఏపీలో కొనసాగుతున్నా, ఆ రెండు పార్టీలకు దగ్గరయ్యేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు చేయని ప్రయత్నం లేదు.ఏదో రకంగా పొత్తు పెట్టుకుని మళ్లీ 2024 ఎన్నికల్లో విజయం సాధించాలనే లక్ష్యంతో ఆయన ముందుకు వెళ్తున్నారు.

 Chandrababu Trying To Form An Alliance With Janasena Through Lingamaneni Ramesh-TeluguStop.com

అయితే బిజెపి ఇప్పుడే కాదు భవిష్యత్తులోనూ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకునే ఆలోచన ఏదీ చేయడం లేదు.ఈ విషయాన్ని చాలా స్పష్టంగా ప్రకటించేసింది.

అలాగే బిజెపి అగ్రనేతలు సైతం ఎప్పటి నుంచో బాబుకు అపాయింట్మెంట్ ఇచ్చేందుకు ఇష్టపడడం లేదు.ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీకి మిగిలిన ఏకైక ఆప్షన్ జనసేన మాత్రమే.

ఆ పార్టీతో పొత్తు పెట్టుకుని 2024 ఎన్నికల్లో గెలవాలి అని చంద్రబాబు ప్లాన్ ఏదో రకంగా బిజెపి జనసేన మధ్య ఉన్న పొత్తును రద్దు చేయించాలని ప్లాన్ చేస్తున్నారు.

Telugu Chandrababu, Jagan, Janasena, Janasenatdp, Pavan Kalyan, Ysrcp-Telugu Pol

ఇదిలా ఉంటే టీడీపీతో పొత్తు విషయమై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఒప్పించే బాధ్యతను తనకు అత్యంత సన్నిహితుడైన , కరకట్టలో తాను నివాసం ఉంటున్న ఇంటి యజమాని లింగమనేని రమేష్ కి చంద్రబాబు బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. లింగమనేని రమేష్ ఇటు చంద్రబాబుకు అటు పవన్ కు అత్యంత సన్నిహితుడైన వ్యక్తిగా ముద్ర వేయించుకున్నారు.అందుకే ఆయనను రంగంలోకి దించినట్లు తెలుస్తోంది.

ఇటీవలే లింగమనేని రమేష్ హైదరాబాదులోని చంద్రబాబు నివాసంలో సమావేశం అయ్యారని, ఈ సందర్భంగా జనసేన తో పొత్తు కుదిరితే తాము ఏ విధమైన ప్రాధాన్యం ఇస్తాము అనే విషయాన్ని చంద్రబాబు లింగమనేని రమేష్ ద్వారా పవన్ కు చెప్పించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.జనసేనకు అత్యధిక స్థానాలు ఇచ్చేందుకు చంద్రబాబు సిద్ధమైనట్లు, ఈ మేరకు లింగమనేని రమేష్ ద్వారా పవన్ కు సమాచారం పంపించి ఏదో రకంగా ఆ పార్టీతో పొత్తు సెట్ చేసుకునే ఆలోచనలో ఉన్నారట.
>

 ఈ విషయమై పవన్ ఏ విధంగా స్పందిస్తారు అనే విషయం పైన ప్రస్తుతం చంద్రబాబు టెన్షన్ పడుతున్నట్లు తెలుస్తోంది.బీజేపీతో పొత్తు పెట్టుకున్న రెండు పార్టీల మధ్య అంతగా సఖ్యత లేనట్టుగానే పరిస్థితులు కనిపిస్తుండడంతో జనసేన పార్టీ టిడిపి వైపు చూసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube