బీజేపీ టీడీపీ పొత్తు ? అసలు ఈ లెక్క ఏంటంటే ? 

రాజకీయ పార్టీల మధ్య వైరం, స్నేహం అనేది చిత్ర విచిత్రంగా జరిగిపోతుంటాయి.ఎవరు ఎవరితో ఎంతకాలం కలిసి ఉంటారు.

 Chandrababu Try To Alliance On Bjp, Janasena, Pavan Kalyan, Modhi, Prime Ministe-TeluguStop.com

ఎవరి పొత్తు ఎప్పుడు రద్దు అవుతుంది అనేది ఎవరికీ తెలియదు.ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు పొత్తుల వ్యవహారం పై జరుగుతున్న రాజకీయం అంతా ఇంతా కాదు.

బిజెపి, జనసేన పార్టీలు కలిసి పొత్తు పెట్టుకోగా, బిజెపి తో వైసీపీ సన్నిహితంగా మెలుగుతుంది.అలా అని నేరుగా ఆ పార్టీతో పొత్తు అయితే పెట్టుకోలేదు.

వీటన్నిటి సంగతి ఇలా ఉంటే , ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ మాత్రమే ఒంటరిగా కనిపిస్తోంది.

తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత ఎప్పుడు ఒంటరిగా ఎన్నికలకు వెళ్ళలేదు.2019 ఎన్నికలలో ఒంటరిగా ఎన్నికలకు వెళ్లి ఘోరమైన ఫలితాలను చవి చూస్తోంది.రాబోయే సార్వత్రిక ఎన్నికలలో ఆ పరిస్థితి తలెత్తకుండా,  బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు తెలుగుదేశం పార్టీ అన్ని మార్గాలలోనూ ప్రయత్నాలు చేస్తోంది.

అయితే బిజెపి మాత్రం తెలుగుదేశం పార్టీని దూరం పెడుతూనే వస్తున్న, చంద్రబాబు మాత్రం బిజెపి ,  టిఆర్ఎస్ అగ్ర నాయకులతో మంతనాలు చేస్తున్నాడు.

Telugu Alliance, Chandrababu, Jagan, Janasena, Modhi, Pavan Kalyan, Prime, Ysrcp

ఏపీలో వైసీపీ అధికారంలోకి రావాలి అంటే మనమంతా కలిసి ముందుకు వెళ్ళడం ఒకటే మార్గమని, కలిసి అధికారం పంచుకుందాం అనే ప్రతిపాదనతో చంద్రబాబు బిజెపి నేతలకు విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలుస్తోంది.ప్రస్తుతం బిజెపి కేంద్ర పెద్దలు సైతం సానుకూలంగా ఉన్నట్లు కనిపిస్తుంది.బీజేపీ, జనసేన, టిడిపి కూటమి ఏర్పడితే తప్పకుండా అధికారంలోకి వస్తుందని, కలిసి ఏపీలో అధికారం పంచుకునేందుకు అవకాశం ఏర్పడుతుందనే అభిప్రాయంతో బిజెపి పెద్దలు టిడిపి విషయంలో కాస్త సానుకూలత వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.

జాతీయ స్థాయిలో బీజేపీ ప్రజా వ్యతిరేకతను ఎదుర్కోవడంతో ఇక తమతో కలిసివచ్చే ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకుని, ఎన్నికలకు వెళితే సరైన ఫలితాలు వస్తాయనే అభిప్రాయంతో బిజెపి పెద్దలు ఉన్నారట.అందుకే దక్షిణాది రాష్ట్రాలలో ఉన్న ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకునే దిశగా బీజేపీ అడుగులు వేస్తున్న టిడిపికి కలిసి వచ్చే అవకాశం ఉన్నట్లుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube