ఆరు నెలల తరువాత బాబు-కెసీఆర్ కలయిక

దాదాపు ఆరు నెలల తరువాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు , తెలంగాణా ముఖ్యమంత్రి కెసీఆర్ ఆదివారం అంటే ఈ నెల 18 న కలుసుకోబోతున్నారు.ఇది ఆహ్వానం కోసం జరుగుతున్న కలయిక.

 Chandrababu To Meet Kcr To Invite For Amaravati Foundation Ceremony-TeluguStop.com

ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపనకు ఆహ్వానించడానికి కెసీఆర్ ఇంటికి చంద్రబాబు వస్తున్నారు.ముందుగా ఏపీ సీఎమ్ కార్యాలయ అధికారులు వచ్చి కెసీఆర్ అప్పాయింట్మెంట్ తీసుకున్నారు.

బాబు కేవలం ఆహ్వాన పత్రిక ఇచ్చి వెళ్ళిపోకుండా కొద్దిసేపు కేసీఆర్తో సమావేశమై మంచి చెడూ మాట్లాడుకుంటారు అని సమాచారం.చాలా కాలం నుంచి ఉప్పు నిప్పుగా ఉంటున్న ఇద్దరు చంద్రుళ్ళు కొద్దిసేపైనా మనసు విప్పి మాట్లాడుకుంటే వాతావరణం చల్లబడుతుంది.

నోటుకు ఓటు కుంభకోణం, ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు ఇద్దరి మధ్య దూరం పెంచాయి.కొంతకాలంగా ఈ రెండు వివాదాలకు ఇద్దరు ముఖ్యమంత్రులు దూరంగా ఉన్నారు.

ఇతర విషయాల మీద కూడా వాదులాడుకోవడం లేదు.ఆదివారం చంద్రబాబు రెండు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ను కూడా కలుసుకొని ఆహ్వాన పత్రిక అందచేస్తారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube