చంద్ర‌బాబు ఆ సెంటిమెంట్ బ్రేక్ చేస్తారా?

ఎన్నిక‌ల‌కు రెండేళ్లే స‌మ‌యం ఉండ‌టంతో ఏపీలో రాజ‌కీయ పార్టీలన్నీ త‌మ వ్యూహాల‌కు ప‌దునుపెడుతున్నాయి! అభివృద్ధి మంత్రంతో దూసుకుపోతున్న సీఎం చంద్ర‌బాబు ఈ సారి గెలుపుపై ధీమాగానే ఉన్నారు.చిన్న చిన్న స‌మ‌స్య‌లున్నా.

 Chandrababu To Break Sentiment-TeluguStop.com

త‌న అనుభ‌వ‌మే శ్రీ‌రామ‌ర‌క్ష‌గా మారుతుంద‌ని విశ్వాసం ఆయ‌న‌లో క‌నిపిస్తోంది.అయితే మ‌నుషుల‌ను న‌మ్మ‌ని వారు కూడా సెంటిమెంట్ల‌ను న‌మ్ముతారు! అలాంటి సెంటిమెంట్లు కొన్ని ఇప్పుడు చంద్ర‌బాబు అండ్ కో ని తీవ్రంగా ఆందోళ‌న‌కు గురిచేస్తున్నాయి! మ‌రి ఆయ‌న ఆ సెంటిమెంట్ ను బాబు బ్రేక్ చేస్తారా? అని పార్టీ వ‌ర్గాలు సందేహాలు వ్య‌క్తంచేస్తున్నాయి.

సీఎం చంద్ర‌బాబుకు న‌మ్మ‌కాలు ఎక్కువ‌నే విష‌యం చాలాసార్లు బ‌య‌ట‌ప‌డింది.అమ‌రావ‌తి శంకుస్థాప‌న, తాత్కాలిక స‌చివాల‌య భ‌వ‌న నిర్మాణం పూర్తి కాక‌ముందే గృహ‌ప్ర‌వేశం ఇలా ఆయ‌న‌కు సెంటిమెంట్లు ఏ రేంజ్‌లో ఉంటాయో చెప్ప‌డానికి కొన్ని ఉదాహ‌ర‌ణ‌లు మాత్ర‌మే! అవిభ‌క్త ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు తొమ్మిదేళ్లు సీఎంగా ప‌నిచేశారు, ఇక 1999లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఆయ‌న ఒంట‌రిగా అధికారంలోకి రాలేదు.బీజేపీతో పొత్తుతో గెలిచారు.2004లో ఓడిపోయిన చంద్ర‌బాబు ఏకంగా 9 సంవ‌త్స‌రాల పాటు ప్ర‌తిప‌క్షంలో ఉండి రికార్డు సృష్టించారు.

ఇక 2009లో అధికారంలోకి వ‌స్తార‌ని అంతా భావించారు.కానీ ఆ ఎన్నిక‌ల్లో చిరంజీవి ఆయ‌న ఆశ‌ల‌కు గండికొట్టారు! అలా చివర 9 వ‌చ్చిన ప్ర‌తిసారీ ఆయ‌న అధికారినికి దూరంగానే ఉంటున్నారు.ఇక ఇప్పుడు 2019లో ఎన్నిక‌లు జ‌ర‌గబోతున్నాయి! దీంతో టీడీపీ నాయ‌కుల‌కు 9 ఫీవ‌ర్ పట్టుకుంది.2019 ఎన్నిక‌లు కూడా బాబుకు విష‌మ ప‌రీక్షే! ఒక‌వైపు జ‌గ‌న్‌.మ‌రోప‌క్క ప‌వ‌న్ క‌ల్యాణ్‌! ఇక కాపుల రిజ‌ర్వేష‌న్ స‌మ‌స్య ఉండ‌నే ఉంది!

రాజ‌ధాని నిర్మాణంలో క‌ద‌లిక లేదు.హోదా విష‌యంలో ఇక కేంద్రం చెప్పిన‌ట్లు వినాల్సిందే! ఇక 2014లో టీడీపీకి మిత్ర‌ప‌క్షంగా వ్య‌వ‌హ‌రించిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌.2019 ఎన్నిక‌ల నాటికి కీల‌కంగా మారుతుంద‌న్న అంచ‌నాలు ఉన్నాయి.ఇక టీడీపీతో క‌టీఫ్ దిశ‌గా ప‌వ‌న్ అడుగులేస్తున్నారు! మ‌రి ఇప్పుడు ఈ సెంటిమెంట్ల‌ను బాబు అధిగ‌మించి.

అధికారం చేజిక్కించుకుంటారో లేదో వేచిచూద్దాం!!

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube