నిన్న లోకేష్ నేడు చంద్రబాబు కరోనా పాజిటివ్..!!

దేశంలో కరోనా వైరస్ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్న సంగతి తెలిసిందే.సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా భారీగా కరోనా బారిన పడుతున్నారు.

 Chandrababu Tested Corona Positive , Chandrababu, Nara Lokesh-TeluguStop.com

ఊహించని రీతిలో కేసులు దేశవ్యాప్తంగా లక్షల్లో నమోదవుతున్నాయి.ఇంటిలో ఒకరికి కరోనా సోకినా… మిగతా వాళ్ళకి కూడా సోకుతుంది.

ఈ నేపథ్యంలో తాజాగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకి కరోనా పాజిటివ్ అని నేడు నిర్ధారణ అయింది.అంతకుముందే నిన్న తనయుడు నారా లోకేష్ కి పాజిటివ్ నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే.

 Chandrababu Tested Corona Positive , Chandrababu, Nara Lokesh-నిన్న లోకేష్ నేడు చంద్రబాబు కరోనా పాజిటివ్..-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ నేపథ్యంలో చంద్రబాబుకి  కూడా స్వల్ప లక్షణాలు ఉండటంతో… వెంటనే పరీక్షలు చేయించుకోగా  కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడం జరిగింది.ఈ విషయాన్ని స్వయంగా ఆయనే సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.

ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్ లో డాక్టర్ల సూచనల మేరకు చికిత్స తీసుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు.ఇక ఇదే తరుణంలో వారం రోజుల నుండి తనతో కాంటాక్ట్ అయిన ప్రతి ఒక్కరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని తెలియజేశారు.

ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్వల్ప లక్షణాలు ఉన్నాయని.చంద్రబాబు చెప్పుకొచ్చారు.

ఇటీవల చంద్రబాబు ఏపీలో పలు కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది.ముఖ్యంగా గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో.

టీడీపీ  కార్యకర్త హత్యకు సంబంధించి.నిరసన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు.

Video : Chandrababu Tested Corona Positive Chandrababu, Nara Lokesh

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube