అటు చిరు.. ఇటు ముద్రగడ ! బాబు కి మంట పుట్టిస్తున్నారే ? 

Chandrababu Tension Over Whether There Will Be A Split In The Kapu Community Due To Mudragada Padmanabhan Chiranjeevi

రాబోయే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని టిడిపి అధినేత చంద్రబాబు ఎన్నో రాజకీయ ఎత్తుగడలను అమలు చేస్తున్నారు.క్షణం తీరిక లేకుండా క్షేత్రస్థాయిలో పర్యటనలు చేస్తున్నారు.

 Chandrababu Tension Over Whether There Will Be A Split In The Kapu Community Due To Mudragada Padmanabhan Chiranjeevi-TeluguStop.com

ఎన్నికల సమయం నాటికి ఎటువంటి ఇబ్బందులు ఏర్పడకుండా ముందుగానే పొత్తుల వ్యవహారాల పైన చురుగ్గా వ్యవహరిస్తున్నారు.అధికార పార్టీ వైసీపీని ఎదుర్కొనేందుకు అన్ని రకాల ఎత్తుగడలను అమలు చేస్తున్నారు.

ముఖ్యంగా సామాజిక వర్గాల వారీగా టిడిపికి అండదండలు ఉండేవిధంగా ముందుగానే అలర్ట్ అవుతున్నారు.  దీంట్లో కాపు , బిసి సామాజిక వర్గాలను పూర్తిగా టిడిపికి అనుకూలంగా మార్చుకుంటే తమకు ఇబ్బందులు ఉండవని బాబు అంచనా వేస్తున్నారు.

 Chandrababu Tension Over Whether There Will Be A Split In The Kapu Community Due To Mudragada Padmanabhan Chiranjeevi-అటు చిరు.. ఇటు ముద్రగడ బాబు కి మంట పుట్టిస్తున్నారే  -Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

      2019 ఎన్నికల్లో బీసీ సామాజికవర్గం ఎక్కువగా వైసిపికి అనుకూలంగా వ్యవహరించడం, అలాగే ఆ సామాజిక వర్గానికి మేలు చేసే విధంగా జగన్ ఎన్నో పదవులు ఆ సామాజిక వర్గాలకు కట్టబెడుతూ ఉండడం, బీసీలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తామనే విధంగా వ్యవహారాలు చేస్తుండడం వంటివి టిడిపికి ఇబ్బంది కరంగా మారాయి.టిడిపి అధికారంలో ఉన్న సమయంలో కాపులకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం వంటివి బీసీల్లో ఆగ్రహానికి కారణం అయ్యాయి.

అదే సమయం లో కాపు సామాజిక వర్గం వైసిపి పై ఆగ్రహంగా ఉందని , బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉండడం తో జగన్ పట్టించుకోవడం లేదనే అసంతృప్తి ఉందని బాబు  అంచనా వేస్తున్నారు.
     

   అయితే కాపులు పూర్తిగా టీడీపీకి అనుకూలంగా మారుతారా అంటే ఆ పరిస్థితి లేదన్న విషయాన్ని బాబు గుర్తించారు.అందుకే జనసేన ద్వారా కాపు సామాజిక వర్గం మద్దతు పొందాలని , ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటే తిరుగే ఉండదని లెక్కలు వేసుకుంటున్నారు.కానీ అదే సమయంలో మాజీ  మంత్రి , కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం కొత్త పార్టీ పెట్టే ఆలోచన లో ఉండటం, కాపుల్లో చీలిక తీసుకొచ్చేందుకు ప్రయత్నించడం టీడీపీకి ఆందోళన కలిగిస్తోంది .అలాగే పదేపదే మెగాస్టార్ చిరంజీవి ఏపీ సీఎం జగన్ ను కలుస్తూ,  ప్రభుత్వాన్ని పొగుడుతూ ఉండడం బాబుకు మంట పుట్టిస్తోంది.అటు ముద్రగడ ఇటు మెగాస్టార్ చిరంజీవి కారణంగా కాపు సామాజిక వర్గం ఓట్లలో చీలిక వస్తుందని ఆయన టెన్షన్ పడుతున్నారట.

chandrababu tension over whether ther will be a split in the kapu community due to mudragada padmanabhan chiranjeevi Mudragada padmanabham, Chandrababu, TDP, kapu, ap, BC caste, TDP troubled, 2024 elections, megastar chirnajivi - Telugu Bc, Chandrababu, Kapu, Chiranjivi, Tdp Troubled

#TDP Troubled #BC #Kapu #Chandrababu #Chiranjivi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube