బాబు కి మరో గండం ! వెంటాడుతున్న' నీరు - చెట్టు ' ?

పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల తంతు ముగియడం, వైసీపీ జెండా దాదాపు అన్ని చోట్ల ఎగరడంతో మంచి జోష్ లో వైసీపీ ఉంది.ఇక పూర్తిగా తమ రాజకీయ శత్రువులకు ఎక్కడికక్కడ చెక్ పెట్టి, రాబోయే ఎన్నికల నాటికి మరింత బలహీనం చేసే విషయంపైన జగన్ దృష్టి పెట్టారు.దానిలో భాగంగానే టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటికే అమరావతి వ్యవహారంలో సీఐడీ నోటీసులు అందాయి.23వ తేదీన ఆయన విచారణకు రమ్మని సిఐడి నోటీసుల్లో పేర్కొంది.ఈ వ్యవహారంలో చంద్రబాబు అరెస్ట్ అవుతారంటూ హడావుడి జరుగుతున్న, ఆయన దీనిపై కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకునే ఆలోచనలో ఉన్నారు.అయితే చంద్రబాబు ఈ కేసు నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్న సమయంలోనే ఆయన పై మరో కేసును వైసీపీ తెర మీదకు తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది.

 Chandrababu Tension On Neeru Chettu Scam , Tdp, Ap, Chandrababu, Neeru Chettu,-TeluguStop.com

టీడీపీ ప్రభుత్వ హయాంలో నీరు – చెట్టు పథకం కింద భారీగా అక్రమాలు జరిగాయని వైసిపి మొదటి నుంచి ఆరోపిస్తోంది.అంతేకాకుండా ఈ పనులపై వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ చేస్తోంది.

ఇదే విషయాన్ని హైకోర్టుకు గతంలోనే ఏపీ ప్రభుత్వం తెలిపింది.నీరు చెట్టు పథకం కింద గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కోట్ల రూపాయలు దుర్వినియోగం అయిందని, ఈ పథకం పేరుతో అభివృద్ధి జరగలేదని, వైసీపీ విమర్శలు చేస్తూ వస్తోంది.

ప్రస్తుతం అమరావతి భూ వ్యవహారాలపై పెద్ద ఎత్తున టీడీపీ ఆరోపణలు ఎదుర్కొంటోంది.ఇప్పుడు ఈ వ్యవహారం లో చంద్రబాబు ఇరుక్కునే అవకాశం ఉందని టెన్షన్ ఆ పార్టీలో నెలకొంది.

Telugu Ap, Chandrababu, Jagan, Neeru Chettu, Ysrcp-Telugu Political News

ఇదే సమయంలో ఇప్పుడు నీరు చెట్టు పథకం లో అవతవకలపై చంద్రబాబును తప్పకుండా అరెస్ట్ చేయించేందుకు ఉన్న అన్ని మార్గాలను వైసీపీ అన్వేషిస్తోంది.ఇప్పుడు ఈ వ్యవహారాలు టీడీపీ ని మరింత కలవరానికి గురిచేస్తున్నాయి.నీరు చెట్టు పథకం లో చోటు చేసుకున్న అవినీతి వ్యవహారాలపై ఇప్పుడు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ లోతుగా దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో, టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు మరి కొంతమంది ఆ పార్టీ నాయకులు ఈ వ్యవహారంలో ఇరుకున పడే అవకాశం ఉందనే ప్రచారం మరింత ఊపందుకుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube