ఏపీలోనే ఇలా ఎందుకు జరిగిందబ్బా ? బాబు ని వేధిస్తున్న ప్రశ్న  

Chandrababu Tension About Evms-

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నికల నిర్వహణ తీరుని తప్పుపడుతూ, ఈవీఎం లలో మోసాలు జరుగుతున్నాయి అంటూ దేశమంతా తిరుగుతూ అల్లరి అల్లరి చేస్తున్నాడు. ఈవీఎం లలో ప్రొగ్రమింగ్ మార్చేశారని, అసలు పెద్ద పెద్ద దేశాల్లో కూడా బ్యాలెట్ పేపర్ వినియోగిస్తుంటే ఈ ఈవీఎం మిషిన్స్ మనకి ఎందుకు అంటూ ఎన్నికల కమిషన్ అధికారులను బాబు అడుగుతున్న ప్రశ్న. ఈవీఎం మిషన్స్ లేకపోతే టీడీపీ విజయం ఖాయం అని, కేంద్ర అధికార పార్టీ బీజేపీ కుట్ర పన్ని ఈవీఎం మిషన్స్ టాంపరింగ్ చేయించిందని బాబు ప్రధాన ఆరోపణ..

ఏపీలోనే ఇలా ఎందుకు జరిగిందబ్బా ? బాబు ని వేధిస్తున్న ప్రశ్న-Chandrababu Tension About EVMS

పోలింగ్ తేదీన ఉదయం పది గంటలకు 35 శాతం ఈవీఎంలు మొరాయించాయి. పదకొండు గంటలకు 45 ఈవీఎంలు మాత్రమే పని చేయలేదు అని ఎన్నికల కమిషన్ ప్రకటించింది.

మొదటి విడతలో పోలింగ్ జరిగిన తెలంగాణ, రెండో విడతలో కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో కూడా పెద్దగా ఈవీఎం మిషన్స్ లో లోపాలు తలెత్తలేదు. ఒకటి రెండు చోట్ల మిషన్స్ మొరాయించిన పోలింగ్కి మాత్రం ఎక్కడా ఆటంకం కలగలేదు. కానీ ఏపీలోనే అలా ఎందుకు జరిగిందన్నది టీడీపీ అధినేత తో సహా మిగతా నాయకులకు అంతుపట్టడంలేదు.

భెల్, ఈసీఐఎల్ ఇంజనీర్లు నియోజకవర్గానికి ముగ్గురు చొప్పున ఉన్నా వారు అనేక ప్రాంతాల్లో సమస్యలు రావటంతో బాగు చేయటం ఆలస్యమైంది. దీంతో పోలింగ్ మరుసటి రోజు తెల్లవారుజాము వరకు జరిగింది. ఈవీఎంలలో వచ్చిన సాంకేతిక లోపాలతో కొన్ని ప్రాంతాల్లో వాటిని మార్చినప్పటికీ, మరికొన్ని ప్రాంతాల్లో అవి తరచూ సమస్యలు వస్తూనే కనిపించాయి.

ఈవీఎం మిషన్స్ లో లోపల కారణంగా ఓటేసేందుకు వచ్చి క్యూలో నిలబడ్డవారు అసహనానికి గురయ్యారు. చంద్రబాబు తనయుడు లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరి నియోజకవర్గంలో కూడా నలభై పోలింగ్‌ బూత్‌లలో ఈ సమస్య కనిపించింది. ఈవీఎంల్లో ఏర్పడిన సాంకేతిక సమస్యలను సరిదిద్దేందుకు సాయంత్రం 4 గంటల వరకు సాంకేతిక నిపుణులు హైరానాపడుతూనే ఉన్నారు. ఇక రెండో విడత పోలింగ్ జరిగిన పశ్చిమబెంగాల్, తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో ఈవీఎంల్లో సాంకేతిక సమస్యలు తలెత్తినా అవి ఏపీలో వచ్చినంత స్థాయిలో మాత్రం రాలేదు. ఇదే టీడీపీని వేధిస్తోంది.

మిగతా రాష్ట్రాల్లో ఈవీఎం లు సక్రమంగా పనిచేసినా ఏపీలోనే ఇలా ఎందుకు జరిగింది అనే విషయం అంతుబట్టడంలేదు.