కన్నీరు పెట్టుకున్న చంద్రబాబు

మాజీ మంత్రి, మాజీ అసెంబ్లీ స్పీకర్‌ తెలుగు దేశం పార్టీ సీనియర్‌ నేత కోడెల శివ ప్రసాద్‌రావు మృతి పట్ల చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశాడు.తెలుగు దేశం పార్టీ ఆరంభం నుండి ఆయన పని చేశారు.

 Chandrababu Tears On Kodela Siva Prasaddied-TeluguStop.com

చంద్రబాబు నాయుడుతో కోడెలకు చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.అలాంటి కోడెల మృతితో చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.

కోడెల మృతి విషయాన్ని బాలకృష్ణ ఫోన్‌ చేసి చంద్రబాబు నాయుడుకు తెలియజేయడం జరిగిందట.

గుంటూరు తెలుగు దేశం పార్టీ ఆఫీస్‌లో మీడియాతో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.

ఒక సహచరుడిని కోల్పోయాను.సీనియర్‌ నేతను కోల్పోవడం భరించలేక పోతున్నాను.

ఆ బాధ నుండి కోలుకోవడానికి టైం పడుతుందని బాబు అన్నారు.కోడెలను మానసికంగా చాలా క్షోభ పెట్టారు.

ఆయన్ను ఈ వయసులో హింసించారు.భరించలేని అవమానంతో ఆయన ఇంట్లోని ఫ్యానుకు ఉరి వేసుకుని చనిపోయాడంటూ చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశాడు.

బాలకృష్ణ ఈ విషయం చెప్పగానే నేను షాక్‌కు గురయ్యాను అంటూ బాబు ఎమోషనల్‌ అయ్యి కన్నీరు పెట్టుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube