ఆ లీడర్లతో బాబు కి విసుగు ? వారంతా పనికిరానివారేనా ?  

Chandrababu Tdp Senior Leaders - Telugu Andhra Visit, Chandrababu, Lg Polymers Issue, Tdp Senior Leaders, Vizag

పార్టీని మరింత ఉన్నత స్థానానికి తీసుకు వెళ్లాలని నిరంతరం తపిస్తూ ఉంటారు టిడిపి అధినేత చంద్రబాబునాయుడు.దీనికోసం తన వయసును సైతం లెక్కచేయకుండా, నిరంతరం కష్టపడుతూనే ఉంటారు.

 Chandrababu Tdp Senior Leaders

పార్టీ ఇప్పుడు విపక్షంలో ఉంది.అయినా అధికార పార్టీకి ధీటుగా రాజకీయాలు చేయడంలో చంద్రబాబు పైచేయి సాధిస్తూనే ఉన్నారు.70 సంవత్సరాల వయసులోనూ నిరంతరం పార్టీ కోసం తపిస్తూ చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరు నిజంగా అందరికీ స్ఫూర్తిదాయకం.తన రాజకీయ వారసుడిగా లోకేష్ ఉన్నా, ఆయనను పక్కన పెట్టి మరి చంద్రబాబు పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ గా ఉంటున్నారు.ప్రజా సమస్యలను నిరంతరం ఎత్తిచూపుతూ, అధికార ఆగడాలను ఎండగట్టడంలో ముందుంటున్నారు.2024 లో సీఎం అభ్యర్థి తానే అని, ఇప్పట్లో రాజకీయాలకు స్వస్తి చెప్పే అవకాశమే లేదని చంద్రబాబు సంకేతాలు పంపుతున్నారు.ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం రెండు తెలుగు రాష్ట్రాలు తీవ్రంగా ఉంది.

ఇప్పటి వరకు హైదరాబాద్ కే పరిమితమైన చంద్రబాబు ఏపీకి వచ్చేందుకు చాలా రోజులుగా ప్రయత్నిస్తూనే ఉన్నారు.

ఆ లీడర్లతో బాబు కి విసుగు వారంతా పనికిరానివారేనా -Political-Telugu Tollywood Photo Image

ఈ మేరకు ఏపీ వచ్చేందుకు పోలీసులు అనుమతి కూడా లభించింది.హైదరాబాద్ నుంచి నేరుగా విశాఖ కి వెళ్లి అక్కడ ఎల్జీ పాలిమర్స్ బాధితులను పరామర్శించాలని భావించారు.

అయితే ఆకస్మాత్తుగా కేంద్ర విమానయాన శాఖ విమానాల రాకపోకలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడంతో చంద్రబాబు పర్యటన సందిగ్ధంలో పడింది.ఆయన మళ్లీ విమానాలు తిరిగే వరకు వేచి చూస్తారా లేదా నేరుగా అమరావతికి వెళ్తారా అనేది ఇంకా క్లారిటీ రాలేదు.

ఇదిలా ఉంటే తెలుగుదేశం పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు ఎవరూ యాక్టివ్ గా ఉండడంలేదు.పార్టీ తో అంటీ ముట్టనట్లుగానే వ్యవహరిస్తున్నారు.

టిడిపి ఆవిర్భావం నుంచి ఉన్న నాయకులతో పాటు చంద్రబాబు కోటరీ నాయకులుగా చెప్తున్న వారంతా ఇప్పుడు పూర్తిగా సైలెంట్ అయిపోయారు.ఒకవైపు అధికార పార్టీ దూకుడుగా వ్యవహరిస్తుండగా, మరోవైపు వయస్సు పైబడటంతో తమకు ఎందుకులే అన్న నిర్లక్ష్యంతో చాలామంది నాయకులు ఉన్నారు.అలాగే కరోనా వైరస్ ప్రభావం కారణంగా, ఆరోగ్య రీత్యా తాము బయట తిరగడం అంత మంచిది కాదు అన్న ఉద్దేశంతో చాలామంది నాయకులు ఉన్నారు.పార్టీ సీనియర్ నాయకులంతా ఇలా నిర్లక్ష్యంగా ఉండడంపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.

పదవుల వరకేనా, పార్టీ కోసం కాస్త కష్టపడేందుకు ముందుకు రారా అని ఒకరిద్దరు సీనియర్ నాయకులతో చంద్రబాబు వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది.ఎవరు కలిసి వచ్చినా, రాకపోయినా, చంద్రబాబు మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా కార్యకర్తల్లో ఉత్సాహం పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఇప్పుడు లాక్ డౌన్ నిబంధనలు సడలించడంతో ఇక పార్టీ కార్యక్రమాల జోరు పెంచాలని చంద్రబాబు చూస్తుంటే, సీనియర్లు మాత్రం పార్టీతో సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Chandrababu Tdp Senior Leaders Related Telugu News,Photos/Pics,Images..

footer-test