పవన్ కి ఎన్టీఆర్ కి మధ్య పొగపెడుతున్న చంద్రబాబు..       2018-05-04   09:08:48  IST  Bhanu C

ప్రజలలో విపరీతమైన క్రేజ్ ఉన్న నటుడు పవన్ కళ్యాణ్..ఎంత క్రేజ్ ఉందంటే గత ఎన్నికల్లో జగన్ కి రావాల్సిన కుర్చీ ని లాగేసి చంద్రబాబుని కూర్చో పెట్టగాలిగేంత క్రేజ్..అందుకే గత ఎన్నికల్లో చంద్రబాబు చావు తప్పి కన్ను లొట్ట పోయినట్టుగా 2 % తేడాతో గెలిచిపోయారు..అయితే ఎన్నికల తరువాత కూడా పవన్ కళ్యాణ్ చంద్రబాబు కి మద్దతుగా మాట్లాడతూ ఉండటంతో అందరూ ఈ సారి కూడా పవన సపోర్ట్ చంద్రబాబు కే ఈ సారి సీఎం కుర్చీ కూడా చంద్రబాబు కే అని ఫిక్స్ అయ్యారు..అయితే

అనూహ్యమైన పరిణామాల వలన పవన్ చంద్రబాబు కి గుంటూరు సభలో ఘలక్ ఇవ్వంతో చంద్రబాబు కి ఊహించని షాక్ తగిలింది..వేలమంది ప్రజల సాక్షిగా చంద్రబాబు లోకేష్ లు దొంగలు అంటూ మాట్లాడిన పవన్ కళ్యాణ్ జగన్ ని ఒక్క మాట కూడా అనక పోవడంతో ఈ సారి పవన్ సపోర్ట్ జగన్ కేనని అందరూ ఫిక్స్ అయిపోయారు..అయితే ఈ తరుణంలో చంద్రబాబు ఆలోచనలో పడ్డారు నిజంగా పవన్ కళ్యాణ్ తన ఊపుని కొనసాగిస్తూ ఏపీ లో ఎన్నికలవరకూ ఇదే టెంపో తో ఉంటే అసలుకే మోసం వస్తుందని గ్రహించిన చంద్రబాబు పవన్ జోరుకి బ్రేకులు వేసే ఉపాయాన్ని సిద్దం చేశారు..

గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ సపోర్ట్ తో పవన్ ప్రచారంతో సరిపెట్టేసుకున్న చంద్రబాబు నాయుడు ఇప్పుడు పవన్ దూరం అవడంతో ఎన్టీఆర్ ఫ్యామిలీ ని దగ్గర తీసుకోవడం మొదలు పెట్టాడు…అయితే ఈ పరిస్థితిని ముందుగానే గ్రహించిన చంద్రబాబు ఈ వ్యూహాన్ని కొన్ని నెలల క్రితమే రచించినట్టుగా తెలుస్తోంది..అందులో భాగంగానే ఎన్టీఆర్ అన్న కళ్యాణ్ రామ్ ఒక ఆడియో ఫంక్షన్ లో వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరుపున నేను తమ్ముడు ఎన్టీఆర్ ప్రచారమ చేస్తామని ప్రకటించాడు..

అయితే ఆ ప్రకటన తరువాత ఎన్టీఆర్ ,కళ్యాణ్ రామ్ చంద్రబాబు ని కలిశారని అంతకు ముందు ఎన్టీఆర్ ఎ విధంగా అయితే ఎన్నికలో ప్రచారం చేశాడో అందేవిధంగా ప్రచారం చేస్తాడని తెలిపాదట కళ్యాణ్ రామ్..అయితే ఈ చర్చలలో పవన్ కళ్యాణ్ పై కూడా ఎన్టీఆర్ వైపు నుంచీ గట్టిగా టార్గెట్ చేయాలనీ అలా చేస్తేనే ఒక టాలీవుడ్ హీరో ని మరొక హీరో తో టార్గెట్ చేయిస్తేనే ప్రజలలో హైప్ తగ్గుతుందని చెప్పారట చంద్రబాబు..అంతేకాదు దానికి సంభందించిన కసరత్తులు మే నెల తరువాత నుంచీ మొదలు చేస్తారని తెలుస్తోంది..అయితే ఎన్టీఆర్ ఈ సారి ప్రచారంలో పవన్ కళ్యాణ్ పై ఎటువంటి డైలాగులు వాడబోతున్నాడో అనే టెన్షన్ అందరిలో నెలకొంది..అయితే ఈ దెబ్బతో టాలీవుడ్ సైతం రెండుగా చీలిపోయే ప్రమాదం కూడా పొంచి ఉంది అంటున్నారు విశ్లేషకులు ఏది ఏమైనా సరే వచ్చే ఎన్నికలు మాత్రం అటు పార్టీలలో ఇటు సినిమా ఇండస్ట్రీ లో సెగలు పుట్టించడానికి సిద్దంగా ఉన్నాయి అంటున్నారు.