బాబు రాళ్ల  రాజకీయం ! సానుభూతి ఓట్లు రాలేనా ?

అధ్యక్షుడు చంద్రబాబు రాజకీయ తెలుగు తెలివితేటలు ఆషామాషీగా ఉండవు.రాజకీయంగా ఎదురు దెబ్బలు తగిలిన ప్రతిసారి,  ఏదో ఒక కొత్త అస్త్రాన్ని బయటకు తీసి గట్టెక్కాలని చూస్తూ ఉంటారు.

 Chandrababu Target On Sentiment Politics In Tirupathi Elections Tdp, Chandrabab-TeluguStop.com

ప్రస్తుతం తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలలో తమ పార్టీ అభ్యర్థి పనబాక లక్ష్మిని గెలిపించి తీరాలనే పట్టుదలతో ఉన్నారు.  ఒకవేళ తమకు విజయం దక్కక పోయినా, వైసిపి కి మాత్రం ఈ విజయం దక్కకూడదనే అభిప్రాయం చంద్రబాబులో కనిపిస్తోంది.

ఇదిలా ఉంటే నిన్న తిరుపతి లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా చంద్రబాబు పైన రాళ్ళు పడ్డాయి.

అయితే ఇదంతా ఎవరు చేశారో,  ఏమో తెలియదు కానీ,  చంద్రబాబు మాత్రం ఈ రాళ్ల దాడికి పాల్పడింది వైసిపి కి చెందినవారే అంటూ, ఆ వ్యవహారాన్ని మరింత రాజకీయం చేశారు.

Telugu Chandrababu, Jagan, Janasena, Pavan Kalyan, Tirupathi, Ysrcp-Telugu Polit

ఈ వ్యవహారానికి నిరసనగా ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు చేసి రోడ్డుపై ధర్నా నిర్వహించారు.ఇక టీడీపీ అనుకూల మీడియాలోనూ దీనికి సంబంధించి కథనాలు బాగా హైలైట్ అయ్యాయి.అసలు 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబును చూసి వైసిపి కంగారు పడుతోందని,  అందుకే ఈ రాళ్ల దాడికి దిగారని,  టిడిపి వరుసగా వైసీపీ పై విమర్శలు చేస్తూనే ఉంది.

దీనిపైన వైసీపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు .అసలు ఈ దాడికి పాల్పడాల్సిన అవసరం తమ పార్టీకి లేదని క్లారిటీ ఇచ్చినా, ఈ వ్యవహారాన్ని సానుభూతిగా మార్చుకుని తిరుపతిలో ఓట్లు పొందాలనే ఎత్తుగడలో టిడిపి ఉన్నట్లుగా వైసిపి  అనుమానిస్తోంది.

 అయితే ఈ సానుభూతి ఎంతవరకు వర్కవుట్ అవుతుంది అనేది సందేహంగా నే ఉంది.ఇప్పుడు ఈ వ్యవహారాన్ని సీరియస్ గా పట్టించుకునే నాయకులే కనిపించడం లేదు.అసలు ఈ సెంటిమెంట్ రాజకీయం వర్కౌట్ అవుతుందని టిడిపి అంచనా వేయడమే మిస్టేక్ గా కనిపిస్తోంది.అయినా వైసీపీ పై ప్రజల్లో వ్యతిరేకత పెంచాలి అన్నట్లుగానే టిడిపి వ్యవహరిస్తున్నట్లు గా ఉంది అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube