సర్వేలతో హడలెత్తిస్తున్న బాబు ! ఈసారి టికెట్లు వారికేనా..?       2018-07-02   01:02:49  IST  Bhanu C

సర్వేలు ఆధారంగా ఎప్పటికప్పుడు జనం నాది తెలుసుకుని దానికి అనుగుణంగా అరిపాలన చేయడం ఏపీ సీఎం చంద్రబాబు స్టయిల్. అయన ఏ పథకం ప్రవేశపెట్టినా అది జనంలోకి ఎలా వెళ్ళింది అనేది తెలుసుకోవడం కోసం సర్వేలు చేయిస్తారు. ఇక ఇప్పుడు ఎన్నికల సమయం దగ్గరకు వచ్చేస్తుండడంతో ఆయన మాములుగా ఊరుకుంటారా ..? క్యాడర్ ను పరుగులు పెట్టించేస్తున్నారు. ఎమ్యెల్యేలు నిత్యం ప్రజల్లో ఉండేలా అనేక కార్యక్రమాలు రూపొందిస్తున్నాడు.

ఇవన్నీ పక్కనపెడితే చంద్రబాబు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాల పరిస్థితి తెలుసుకునేందుకు ఆయన సొంతంగా తయారుచేయించిన ప్రశ్నవళితో ఓ సర్వే టీమ్ ని రంగంలోకి దించాడు. ఈ సర్వే కోసం నిష్ణాణుతులైన ప్రొఫెసర్లను రంగంలోకి దించాడు. ఒక్కో జిల్లా బాధ్యతను ఇద్దరు ప్రొఫెసర్లకు అప్పగించారు. వారికి బాబు స్వయంగా తయారు చేసిన ఒక ప్రశ్నావళిని ఇచ్చారు. ఇందులో పది నుంచి పదిహేను ప్రశ్నలుంటాయి. ఈ ప్రొఫెసర్లు ప్రతి నియోజకవర్గంలో రెండు రోజులు పర్యటించి సమాచారాన్ని సేకరి స్తున్నారు.

ప్రధానంగా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరు, వారిపై ఉన్న ఆరోపణలు, అనుకూల, ప్రతికూల అంశాలు, పార్టీ కార్యక్రమాల్లో సరిగా పాల్గొంటున్నారా లేదా? ఎమ్మెల్యే అందరినీ కలుపుకుని వెళ్తున్నారా? ఇసుక తవ్వకాల్లో తల దూర్చుతున్నారు? ప్రజలు ఆ ఎమ్మెల్యే గురించి ఏమనుకుంటున్నారు? టికెట్‌ ఇస్తే మళ్లీ గెలుస్తారా? అనే ప్రశ్నలతో జనం నాడి తెలుసుకుంటున్నారు. ఇప్పుడు చేస్తున్న సర్వే అంతా ప్రస్తుత ఎమ్యెల్యేల గురించి..టికెట్లు ఆశిస్తున్నవారి గురించి మాత్రమే చేయిస్తున్నారు. ఇది కాకుండా ప్రతి నాలుగు నెలలకు ఒకసారి అంతర్గత సర్వే చేయిస్తున్నారు.

ఇప్పటి వరకు రాష్ట్రంలో చంద్రబాబుకు వచ్చిన సమాచారం ప్రకారం 35 నుంచి 40 నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్పు చేయాల్సిన అవసరం ఉందని తెలుస్తోంది. సర్వే రిపోర్టులు అందగానే ఆ నివేదికలో ప్రతికూల రిపోర్టు వచ్చిన ఎమ్మెల్యేల చిట్టాను వారి ముందుంచి, ప్రజల్లో వ్యతిరేకత ఉన్న వారికి తుది హెచ్చరిక చేస్తారు. ఈ పరిస్థితులను చక్కదిద్దుకోవడానికి మూడు నెలల సమయం ఇవ్వొచ్చని తెలుస్తోంది.

ఆ సమయం లోగా పని తీరును మెరుగుపరుచుకోలేకపోతే టికెట్‌ ఇచ్చేది లేదని తేల్చి చెప్పేస్తారని తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూవు గెలుపు గుర్రాలకే టికెట్ ఇవ్వాలని అనవసర మొహమాటాలు పక్కనపెట్టెయ్యాలని చంద్రబాబు స్ట్రాంగ్ గా ఫిక్స్ అయిపోయాడు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలనే కసి బాబు లో ఎక్కువ కనిపిస్తోంది.