వాట్ ఈజ్ దిస్ : తప్పనిసరి అని చెప్పినా తప్పించుకున్నారు !  

Chandrababu Suffer From Tdp Mla\'s-november Month So Many Tdp Workers And Mla\\'s Join In Ycp

తెలుగుదేశం పార్టీ కష్టాలు గురించి చెప్పుకోవాల్సి వస్తే అంతా ఆగస్ట్ సంక్షేమం గురించే చెప్పుకుంటారు.ప్రతి సంవత్సరం ఆగస్ట్ లో ఏదో ఒక ఒడిదుడుకు రావడం ఆ పార్టీకి ఆనవాయితీగా వస్తోంది.

Chandrababu Suffer From Tdp Mla\'s-november Month So Many Tdp Workers And Mla\'s Join In Ycp Telugu Political Breaking News - Andhra Pradesh,Telangana Partys Coverage-Chandrababu Suffer From TDP MLA's-November Month So Many Tdp Workers And Mla\'s Join In Ycp

అయితే ఈసారి మాత్రం ఆగస్ట్ లో పెద్దగా ఎటువంటి సంక్షోభం రాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.కానీ ఆ ఆగస్ట్ సంక్షోభం కాస్తా నవంబర్ కు మారినట్టుగా కనిపిస్తోంది.

ఎప్పుడూ లేనంత స్థాయిలో చంద్రబాబు ఆందోళనకు గురవుతున్నారు.పార్టీ నుంచి వలసలు పెరిగిపోతుండటం, తన వయస్సు పెరగడం, తన రాజకీయ వారసుడికి పార్టీపై పట్టు లేకపోవడమే కాకుండా ముందుకు నడిపించే అంత శక్తి సామర్ధ్యాలు లేకపోవడం చంద్రబాబు బాధను మరింతగా పెంచుతున్నాయి.

అయితే బాబు బాధను తగ్గించాల్సిన నాయకులు ఈ బాధ మరికాస్త పెరిగేలా చేస్తున్నారు.

తెలుగుదేశం పార్టీ అంటేనే క్రమశిక్షణకు మారుపేరుగా అందరూ చెప్పుకుంటూ ఉంటారు.కానీ ప్రస్తుతం ఆ క్రమశిక్షణ పార్టీలో ఎక్కడా కనిపించడం లేదు.

చంద్రబాబు మాట లెక్క చేసే వారి సంఖ్య పార్టీలో క్రమక్రమంగా తగ్గిపోతూ వస్తోంది.దీనికి ఉదాహరణ గా చెప్పుంటే చంద్రబాబు విజయవాడలో చేపట్టిన దీక్షకు పార్టీ నాయకులంతా తప్పనిసరిగా హాజరుకావాలని షరతులు విధించారు.

అయితే ఆ సమావేశానికి కేవలం ఎనిమిది మంది మాత్రమే హాజరవడం, మిగతావారు మనకెందుకులే అన్నట్టుగా దూరం దూరంగా ఉండడం బాబుకి ఆగ్రహాన్ని తెప్పిస్తోంది.అలాగే పార్టీనీ వీడడమే కాకుండా వ్యక్తిగత విమర్శలకు దిగుతున్న వల్లభనేని వంశీ, దేవినేని అవినాష్ వ్యవహారాలను చర్చించేందుకు, పార్టీలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులు ముందు ముందు వ్యవహరించాల్సిన తీరుపై చర్చించేందుకు శుక్రవారం టిడిపి అత్యవసర భేటీ నిర్వహించింది.

ఈ సమావేశానికి అందరూ తప్పనిసరిగా హాజరుకావాలంటూ ఎమ్మెల్యేలకు ఫోన్లు వెళ్లాయి.అయినా ఈ మీటింగ్ కు కనీసం పది మంది ఎమ్మెల్యేలు కూడా హాజరు కాకపోవడంతో ఎందుకు ఇలా జరిగింది అనే విషయం పైన బాబు ఇప్పుడు ఆరా తీసే పనిలో పడ్డాడు.అత్యవసర మీటింగ్ అని ఫోన్ చేసి పిలిచినా వాళ్ళు ఎందుకు రాలేదు ఈ సమావేశానికి డుమ్మా కొట్టిన వారు అంతా బిజెపి వైపు వెళ్ళబోతున్న వారేనా అనే అనుమానం బాబులో వ్యక్తమవుతోంది.

పార్టీలో తన మాట వినని వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుండడం బాబు లో కలవరం పుట్టిస్తోంది.గతంలో ఎప్పుడు ఇటువంటి దుస్థితి ఎదుర్కోలేదని, పరిస్థితి చేయి దాటి పోయే లా కనిపిస్తోందని చంద్రబాబు అసహనంగా ఉన్నాడట.