బాబు దిగులంతా వీరి గురించేనా ? వాళ్లు వెళ్తే నష్టమేనా ?  

Chandrababu Suffer From Local Leaders-

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పరిస్థితి కక్కలేక మింగలేక అన్నట్టుగా ఉంది.రోజు రోజుకి పార్టీ నుంచి వలసలు పెరిగిపోతుండటంతో ఏమిచేయాలో తెలియని దిక్కుతోచని పరిస్థితుల్లో బాబు ఉన్నాడు.ఎందుకంటే నాయకుల వలసల గురించి బహిరంగంగా ఆయన మాట్లాడితే బాబు లో భయం మొదలయ్యింది అనే సంకేతాలు ప్రజల్లోకి, పార్టీ శ్రేణుల్లోకి వెళ్ళిపోతుందని భావనలో ఆయన ఉన్నాడు..

Chandrababu Suffer From Local Leaders--Chandrababu Suffer From Local Leaders-

ప్రస్తుతం టీడీపీ ఎమ్యెల్యేల్లో చాలామంది బీజేపీ నాయకులతో టచ్ లో ఉన్నారు.తాజాగా గన్నవరం ఎమ్యెల్యే వల్లభనేని వంశీ కూడా బీజేపీలోకి జంప్ చేయలని చూస్తున్నాడు.ఈయనే కాకుండా ఒకరిద్దరు ఎమ్యెల్యేలు త్వరలోనే బీజేపీ కండువా వేసుకోవడం ఖాయమని తేలిపోయింది.

అయితే ఎమ్యెల్యేలు వెళ్లినా పెద్ద నష్టమేమి లేదని కానీ ఆ కింది స్థాయి క్యాడర్ వెళ్తేనే భారీ నష్టం ఉంటుందనేదే బాబు బాధకు కారణం.

ఎమ్యెల్యేలు పార్టీని వదిలి వెళ్లినా ఫర్వాలేదని వారి స్థానంలో ఎన్నికల సమయానికి కొత్త నాయకులను తయారు చేసుకోవచ్చు అనే ఆలోచనలో బాబు ఉన్నాడు.ఎందుకంటే ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఎన్నికల సమయానికి అనేకమంది నాయకులు టీడీపీ కి దొరుకుతారు.

దానిలో ఇటువంటి సందేహం లేదు.అందుకే చంద్రబాబు నాయుడు ఎవరు పార్టీ నుంచి వెళ్లినా, వెళ్లిపోవచ్చన్న సంకేతాలను ఇప్పటికే పంపించారు.ఎవరిని ఉండమని తాము బతిమాలే పరిస్థితి లేదని బహిరంగంగానే చెప్పేస్తున్నారు.

అయితే టీడీపీ ఎమ్యెల్యేలు పార్టీ మారదామన్నా అనుకూల పరిస్థితులు పెద్దగా లేవనే చెప్పాలి.ఎందుకంటే వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ పెట్టిన కండిషన్లే అందుకు కారణంగా, అడ్డంకిగా కనిపిస్తున్నాయి.పార్టీ మారాలనుకుంటే ముందుగా ఎమ్మెల్యే పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి రావాలని జగన్ ఇప్పటికే అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు.

దీంతో పార్టీ మారదామనుకున్న కొద్ది మంది టీడీపీ ఎమ్మెల్యేలు డైలమాలో పడిపోయారు.ఈ పరిణామం ఒకరకంగా చంద్రబాబునాయుడుకు మేలు చేసేదే అని చెప్పుకోవాలి.అందుకే ఎమ్మెల్యేలు తన వద్ద ఉంటారన్న ధీమా ఆయనలో ఉంది.

కానీ ఎమ్మెల్యేల కంటే కీలకమైన నేతలు ద్వితీయ శ్రేణి నేతలు.

క్షేత్రస్థాయిలో బలం, బలగం ఉన్న నేతలు వారు.ఎంపీపీలుగా, సర్పంచ్ లుగా, జడ్పీటీసీలు, వార్డు మెంబర్లుగా పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసే నేతలు వారే.వారి గురించే బాబు ఆందోళనగా ఉన్నాడు.

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తుండటంతో వైసీపీ నియోజవకర్గాల వారీగా టీడీపీ ద్వితీయ శ్రేణి నేతలకు వల వేసే పనిలో పడ్డారు.అయితే స్థానిక నేతలకు జగన్ పెట్టే షరతులు వర్తించవు.ఎందుకంటే వారు పార్టీ సభ్యత్వాన్ని వదులుకుని వస్తే సరిపోతోంది..

ఇప్పటికే అనేక చోట్ల ద్వితీయ శ్రేణి నేతలు వైసీపీలో చేరిపోతున్నారు.త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు ఉండడంతో ఇది తమకు ఎక్కడ చేటు తెస్తుందో అన్న ఆందోళన బాబు లో కనిపిస్తోంది.అందుకే ఆయన హడావుడిగా కార్యకర్తలను పరామర్శించే పేరుతో ఓదార్పు యాత్రకు శ్రీకారం చుట్టాడు.