కొద్ది రోజుల క్రితం కృష్ణ నది కరకట్ట మీద అక్రమ నిర్మాణం అంటూ ప్రభుత్వానికి చెందిన ప్రజావేదికను కూల్చివేసిన జగన్ ప్రభుత్వం మిగతా అక్రమ నిర్మాణాల మీద దృష్టిపెట్టింది.ఇప్పటికే గుర్తించిన 25 అక్రమ కట్టడాల యజమానులకు నోటీసులు జారీ చేసింది.
అంతే కాదు వారం రోజుల వ్యవధిలో సరైన అనుమతి పత్రాలు చూపించాలని, లేకపోతే కూల్చేస్తామంటూ ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.ఈ వ్యవహారం అంతా ఒక ఎత్తు అయితే ఆ అక్రమ కట్టడాల్లో చంద్రబాబు అద్దెకు ఉంటున్న లింగమనేని గెస్ట్ హౌస్ ఉండడం, దాన్ని కూల్చేందుకు జగన్ ప్రభుత్వం తహతహలాడుతుండడంతో అసలు గొడవ మొదలయ్యింది.
ఇన్ని రోజులుగా ఇంత రాద్ధాంతం జరుగుతున్నా ఆ భవనం యజమాని లింగమనేని రమేష్ మాత్రం అజ్ఞాతం వీడడంలేదు.
తన భవనంపై రాష్ట్రవ్యాప్తంగా ఇంత రాజకీయం జరుగుతున్నా లింగమనేని మాత్రం మీడియా ముందుకు రాలేదు.
తన భవనం అనుమతులకు సంబంధించి కనీసం ఎటువంటి ప్రకటన చేయకపోవడం అందరిలో అనేక అనుమానాలు కలిగిస్తోంది.ఇన్ని రోజులు కరకట్ట మీదున్న నిర్మాణాలు అక్రమ కట్టడాలే అని అనుకుంటున్నారు.
ఎందుకంటే 2014లో అధికారంలోకి వచ్చిన కొత్తలో కరకట్ట మీద ఉన్న కొన్ని భవనాలకు అక్రమ నిర్మాణాలంటూ అప్పటి టిడిపి ప్రభుత్వం కూడా నోటీసులు ఇచ్చింది.అయితే లింగమనేని గెస్ట్ హౌస్ అక్రమ నిర్మాణం కాదని, అన్నీ అనుమతులు తీసుకునే నిర్మించినట్లు టీడీపీ బలంగా వాదిస్తోంది.
నిజానికి భవనం యజమాని లింగమనేనే అయితే తన భవనం అక్రమనిర్మాణం కాదని చెప్పాల్సింది లింగమనేని రమేష్.కానీ ఆయన ఎక్కడా స్పందించడంలేదు కానీ టిడిపి నేతలు ఆవేశంగా స్పందిస్తున్నారు.
ఎందుకంటే ప్రభుత్వం నోటీసులిచ్చింది లింగమనేనికే కానీ చంద్రబాబుకో లేక మిగతా టీడీపీ నాయకులకు కాదు కదా.ప్రభుత్వం ఇచ్చిన నోటీసులకు సమాధానం చెప్పాల్సిన లింగమనేని ఏమో ఎవరికీ కనిపించటం లేదు.నోటీసులతో ఏమాత్రం సంబంధం లేని టీడీపీ నాయకులు మాత్రం నానా రచ్చ చేస్తున్నారు.ఇదే అందరిలోనూ అనుమానాలు కలిగిస్తున్నాయి.నిజంగా భవనం యజమాని లింగమనేనే అయితే నోటీసులకు సమాధానం చెప్పటానికి ఆయన ఎందుకు వెనుకాడుతున్నారు ? అనేదే తేలాల్సి ఉంది.