అమరావతికి జై కొట్టడం వెనుక అసలు కథ ఇదా ?

అమరావతి విషయంలో టిడిపి అధినేత చంద్రబాబు ఉ మొదటి నుంచి ఓకే స్టాండ్ తో ఉన్నారు.ఆంధ్రుల రాజధాని అమరావతి అంటూ ఆయన సీఎంగా ఉన్నప్పటి నుంచి చెబుతూనే వస్తున్నారు.

 Chandrababu Stand On Amaravati Capital-TeluguStop.com

రాజధాని నిర్మాణ పనులు అమరావతిలో మొదలు పెట్టేముందు ప్రధానమంత్రి సైతం ఇక్కడకు తీసుకువచ్చి అమరావతి ప్రాధాన్యత ఏమిటో జాతీయ స్థాయిలో చాటిచెప్పే ప్రయత్నం చేశాడు.అమరావతిని ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం వెనుక రాజకీయ, సామాజిక ప్రయోజనాలు కూడా ఎక్కువగానే ఉన్నట్టుగా మొదటి నుంచి అంతా అనుమానిస్తూనే వచ్చారు.

తాజాగా ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అమరావతి విషయాన్ని పక్కనపెట్టేసింది.బడ్జెట్లోనూ రాజధాని నిర్మాణ పనులకు కూడా నిధులు కూడా పెద్దగా కేటాయించకపోవడంపై టిడిపి అభ్యంతరం వ్యక్తం చేసింది.

కొద్ది రోజుల క్రితం అసెంబ్లీలో మూడు రాజధానులు అంటూ జగన్ ప్రకటన చేయడం టీడీపీకి మరింత ఆగ్రహం తెప్పించింది.

తమ పార్టీపై రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో వ్యతిరేకత వ్యక్తమైనా చంద్రబాబు మాత్రం అమరావతి కి జై కొట్టాడు.

ఎట్టిపరిస్థితుల్లోనూ రాజధాని అమరావతి లోని ఉంచాలని వేరే చోటికి తరలించడానికి కుదరదు అంటూ పట్టుబడుతున్నాడు.ప్రస్తుతం రాజధాని ప్రాంత రైతులు చేస్తున్న ఆందోళన వెనుక కూడా బాబు వ్యూహాలు ఉన్నాయి అనేది బహిరంగ రహస్యం .అయితే ఇదే సమయంలో పార్టీలోని మిగతా ప్రాంతాల నాయకులు జగన్ నిర్ణయాన్ని సమర్థిస్తూ, టిడిపి నిర్ణయానికి వ్యతిరేకంగా స్టేట్మెంట్స్ ఇవ్వడాన్ని కూడా బాబు పట్టించుకోవడం లేదు.వైసీపీ కూడా ముందు మూడు రాజధానుల ప్రతిపాదనకు చంద్రబాబు నో చెప్పినా ఆ తర్వాత యూటర్న్ తీసుకుంటారని భావించారు.

కానీ ఇప్పటికీ ఈ విషయంలో బాబు వెనక్కి తగ్గడం లేదు.అయితే బాబు ఈ విధంగా వ్యవహరించటం వెనక పెద్ద రాజకీయ ఎత్తుగడ ఉన్నట్టుగా తెలుస్తోంది.వైసిపి అధికారంలోకి వచ్చిన ఏడు నెలల కాలంలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ప్రజల్లోకి ఆ పార్టీ వెళ్లి పోయింది.దీంతో ఎక్కడ ప్రభుత్వంపై పెద్ద వ్యతిరేకత లేదు.

ఇక బాబు సామాజిక వర్గానికి చెందిన జనాభా గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఎక్కువగా ఉన్నా ఈ ఎన్నికల్లో మాత్రం జగన్ కు జై కొట్టారు.అయితే మూడు రాజధానుల ప్రకటన తరువాత తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం అవ్వడం టీడీపీకి ఆనందాన్ని కలిగిస్తోంది.

Telugu Amaravati, Chandrababu, Krishnagutunr, Vote Bank, Ys Jagan-Telugu Politic

తాము అమరావతికి జై కొట్టినా మిగిలిన రెండు ప్రాంతాలో వ్యతిరేకత పెద్దగా ఉండదని చంద్రబాబు ఒక అంచనాకు వచ్చినట్లుగా తెలుస్తోంది.ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల విషయం తీసుకుంటే ఇక్కడ టీడీపీ క్షేత్ర స్థాయిలో చాలా బలంగా ఉంది.ఆ ప్రాంతంలో వైసీపీకి సంస్థాగతంగా పెద్దగా బలం లేకపోవడమే టీడీపీ ధైర్యానికి కారణం.ఇక గోదావరి జిల్లా వాసులు ఈ విషయాలను పెద్దగా పట్టించుకోరు అనేది టీడీపీ ఆలోచన.

అలాగే రాయలసీమలో వైసీపీకి ఎక్కువ బలం ఉండడంతో ఈ ప్రాంతాన్ని పెద్దగా పరిగణలోకి తీసుకోనలోకి తీసుకోవడంలేదు.ఇలా అన్ని రకాల ఎత్తుగడలు వేసిన తరువాతనే బాబు ఈ విధంగా అమరావతికి జై కొట్టినట్టుగా తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube