కోడిపందేలకి చంద్రబాబు చెక్...బాబు సూపర్ స్కెచ్

సంక్రాతి అనగానే గుర్తుకువచ్చేది కోడి పందాలు.కోడి పందాలు అనగానే గుర్తుకు వచ్చేది గోదావరి జిల్లాలు.

 Chandrababu Sketch On Kodi Pandalu-TeluguStop.com

ఆంధ్రప్రదేశ్ లో సంక్రాంతి అతి పెద్ద పండుగ అనే చెప్పాలి…ఆ నాలుగు రోజులు ఎక్కడ ఎక్కడో ఉండే వాళ్ళు ఎంతో మంది రెక్కలు కట్టుకుని మరీ సొంత ఊర్లకి వచ్చేస్తారు.ఎంతో హడావిడిగా చాల కోలాహలంగా ఉంటాయి గోదావరి జిల్లాలో ఆ నాలుగు రోజులు.

అయితే చిన్న పెద్దా తేడా లేకుండా అందరు అక్కడ నిర్వహించే కోడి పందాలకి వెళ్తూ ఎంతో సంబరపడుతూ ఉంటారు.అయితే ఇవనీ ఒక వైపు కనపడే విషయాలు కానీ కంటికి కనపడేది సంస్కృతీ సాంప్రదాయం కనపడకుండా జరిగేది కోట్ల వ్యాపారం.

జూదం.ఎంతో మంది జీవితాలు రోడ్డున పడే సమయం.

సాక్షాత్తు సుప్రీం కోర్టు కోడిపందాలు ఆపమని చెప్పినా సరే రాజకీయ నాయకుల అండదండలతో ఎదేశ్చఃగా సాగిపోతాయి.టీవీ లకి ఫోజులు ఇస్తూ మరీ ప్రజా ప్రతినిధులు కోడి పందాలు నిర్వహించుకుంటారు.

అయితే ప్రభుత్వాలు పట్టించుకోక పోవడంతో ఎంతో మంది జూదాలకి పాల్పడి జీవితాలని నాశనం చేసుకుంటున్నారు దీనికి కారణం ప్రభుత్వాలే అంటూ విమర్శలు వస్తు ఉంటాయి.అయితే ఈ సమయంలోనే చంద్రబాబు కోడి పందాలకి చెక్ పెట్టనున్నారు.

ప్రజా ప్రతినిధులని అటువైపు వెళ్ళకుండా అడ్డు కట్ట వేయడానికి.చంద్రబాబు ఒక మాస్టర్ ప్లాన్ వేశారు.

సరిగ్గా సంక్రాంతి సందడి సమయంలోనే జన్మభూమి మా ఊరు కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోంది.అంతకుముందు నాలుగు సార్లు చేపట్టిన జన్మభూమికి భిన్నంగా అయిదో విడత కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు.

సంక్షేమం, అభివృద్ధి, సాంకేతికతలకు పెద్దపీట వేస్తున్న సర్కారు వాటినే ప్రాధాన్యతాంశాలుగా తీసుకుంటూ 10 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుంది…జనవరి 2వ తేదీ నుంచి 11వ తేదీ వరకూ నిర్వహించే ఈ కార్యక్రమ ప్రణాళికను సీఎం ప్రకటించారు.

జనవరి 2న సంక్షేమం-సంతృప్తి, జనవరి 3న ఆరోగ్యం-ఆనందం, జనవరి 4న స్వచ్ఛంధ్రాప్రదేశ్, జనవరి 5న విద్యా-వికాసం….

జనవరి 6న మౌలిక సదుపాయాలు… జనవరి 7న సహజ వనరులు-అభివృద్ధి… జనవరి 8న వ్యవసాయం-అనుబంధ రంగాల అభివృద్ధి….జనవరి 9న సుపరిపాలన-టెక్నాలజీ వినియోగం….

జనవరి 10న విజన్ స్వర్ణాంధ్రప్రదేశ్-పేదరికంపై గెలుపు….జనవరి 11న ఆనంద లహరి… ఇలా ఒక్కోరోజు ఒక్కో కార్యక్రమం నిర్వహిస్తారు…అంతేకాదు జన్మభూమి – మా ఊరు కార్యక్రమంగా సందడిగా సక్రమంగా నిర్వహిస్తే అసలు కోడిపందేలు నిర్వహించాలన్న ఆలోచనే రాదని ముఖ్యమంత్రి కామెంట్ చేశారు.

అయితే ఈ కార్యక్రమాలకి దూరంగా ఉండే నాయకులపై రిపోర్ట్స్ తెప్పించుకుని చర్యలు కూడా తీసుకుంటారని కూడా తెలుస్తోంది.అయితే ఎమ్మెల్యే రేసులో ఉండే నాయకులకి ఈ విషయం మింగుడు పడటం లేదు.

గోదావరి జిల్లలో నాయకులు అందరు ఈ కార్యక్రమాల పట్ల అసంతృప్తిగా ఉన్నారని టాక్…సంక్రాంతి తరువాత బాబు రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి మరి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube