ఎందుకు ఇలా జరుగుతోంది ? బాధలో ఉన్నావా బాబు ?  

Chandrababu Silent In Seniour Tdp Leaders Join In Ycp Party - Telugu Ap Local Elections, Balakrioshna Friend Kadhiri Babu Rao, Kadhiri Babu Rao, Rehaman And Balaraju Tainala, Sidda Ramaiah, Tdp Ap, Tdp Chandrababu Naidu, Vizag Tdp Leaders

తెలుగుదేశం పార్టీలో చోటుచేసుకుంటున్న పరిణామాలు ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు కలవరం పుట్టిస్తున్నాయి.వాడివేడిగా స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి మొదలైన తరుణంలో పార్టీ నుంచి కూడా పెద్ద ఎత్తున అధికార పార్టీలోకి నాయకుల వలస వెళుతుండటంపై చంద్రబాబు తీవ్ర అసహనంతో ఉన్నారు.

 Chandrababu Silent In Seniour Tdp Leaders Join In Ycp Party

ఇప్పుడు వైసీపీలోకి వెళ్తున్నవారు, వెళ్లాలని చూస్తున్న వారంతా పార్టీకి అత్యంత కీలకమైన వ్యక్తులతో పాటు సీనియర్ నాయకులు కావడంతో వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ మారకుండా చూసేందుకు చంద్రబాబు శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నాడు.అధికార పార్టీ ఇస్తున్న ఆఫర్లతో కొంతమంది, తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు ఉంటుందన్న భయంతో మరికొంతమంది వైసీపీలో చేరేందుకు క్యూ కడుతున్నారు.

అయితే ఇదంతా స్థానిక సంస్థల ఎన్నికలలో తీవ్ర ప్రభావం చూపుతుందని, తెలుగుదేశం క్యాడర్ లో లేనిపోని భయాలు వస్తాయని చంద్రబాబు ఆవేదన చెందుతున్నట్లు సమాచారం.

ఎందుకు ఇలా జరుగుతోంది బాధలో ఉన్నావా బాబు -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

విశాఖ జిల్లా విషయానికి వస్తే 2019 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా ఫ్యాన్ గాలి బలంగా వీచినా, విశాఖలో మాత్రం టిడిపి నాలుగు సీట్లను గెలుచుకుంది.దీంతో ఇప్పుడు వైసిపి విశాఖను పూర్తిగా తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తోంది.ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే టిడిపి విశాఖ జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబును వైసీపీలో చేర్చుకుంది.

ఇక రెహమాన్, బాలరాజు, తైనాల, చింతలపూడి వెంకటరామయ్య తదితరులు ఇప్పటికే వైసీపీ గూటికి చేరారు.ఇక విశాఖలో ఉన్న నలుగురు ఎమ్మెల్యేలను కూడా వైసీపీలో చేర్చుకునే విధంగా కసరత్తు చేస్తున్నారు.

అయితే వారు ఎన్నికల తరువాత పార్టీలోకి అనధికారికంగా చేరే అవకాశం ఉన్నట్లు గా సమాచారం.

ఇప్పటికే ప్రకాశం జిల్లాకు చెందిన కనిగిరి మాజీ ఎమ్మెల్యే టిడిపి నాయకుడు కదిరి బాబురావు వైసీపీ లోకి వచ్చారు.

బాలకృష్ణ అత్యంత సన్నిహితుడిగా పేరొందిన బాబురావు వైసీపీలో చేరడం తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి మింగుడు పడడం లేదు.అలాగే ప్రకాశం జిల్లాలో బలమైన నాయకుడుగా ఉన్న సీనియర్ రాజకీయ నాయకుడు, చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం కూడా వైసీపీలోకి చేరారని, ఆయనతో పాటు ఆయన కుమారుడు వెంకటేష్ కూడా వైసీపీ కండువా కప్పుకున్నారు.

మాజీ మంత్రి సిద్ధ రాఘవరావు తో పాటు ఇంకా అనేక మంది జిల్లా స్థాయి నాయకులు వైసీపీ లోకి వచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.దీంతో మొత్తం ప్రకాశం జిల్లాలో టిడిపి ఉనికి కోల్పోయే పరిస్థితులు ఏర్పడ్డాయి.

ఇలా ఒక్కొక్కరుగా వైసీపీ తీర్థం పుచ్చుకోవడంతో ఈ వలసలను ఏవిధంగా ఆపాలో తెలియక టీడీపీ అధిష్టానం తలలు పట్టుకుంటోంది.తూర్పుగోదావరి జిల్లా అమలాపురం మున్సిపాలిటీ పరిధిలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి టిడిపి నాయకుల ఇళ్లకు వెళ్లి మరి వైసీపీలో చేరాలని ఆహ్వానిస్తుండడంతో పెద్ద ఎత్తున చేరికలు జరుగుతున్నాయి.అమలాపురం మాజీ మున్సిపల్ చైర్మన్ సతీష్ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైసీపీ గూటికి చేరారు.ఇలా ప్రతి జిల్లాలోనూ పెద్దఎత్తున నాయకులు టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలోకి వెళుతుండటంతో ఇంకా ఎవరెవరు వెళ్తారు అనే టెన్షన్ తెలుగుదేశం పార్టీలో కనిపిస్తోంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Chandrababu Silent In Seniour Tdp Leaders Join In Ycp Party Related Telugu News,Photos/Pics,Images..

footer-test