జగన్ యాత్రకి ధీటుగా..బాబు సంచలన నిర్ణయం..       2018-06-14   03:38:33  IST  Bhanu C

ఏపీ ప్రతిపక్ష పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తలపెట్టిన పాదయాత్ర ప్రారంభించిన తోలి నాళ్లలో పెద్దగా స్పందన లేకపోయింది..జగన్ ఇలా యాత్రని మొదలుపెట్టాడో లేదో వెంటనే జగన్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు కీలక నేతలు టీడీపీ కండువా కప్పుకునేలా చంద్రబాబు మాస్టర్ స్కెచ్ వేసి జగన్ యాత్రకి హైప్ రాకుండా చేసేశారు..జిల్లా జిల్లాకి జగన్ యాత్ర వెళుతుంటే..వెళ్ళిన జిల్లాలో ఎవరో ఒక కీలక నేత టీడీపీ లోకి వచ్చేలా వ్యుహాలు రచించారు సక్సెస్ అయ్యారు..అయితే వలసలు జంపింగ్ లు కొంతకాలం వరకే జరిగాయి..కానీ జగన్ ప్రభంజనం రోజు రోజుకి పెరుగుతూ ఉండటంతో బాబు ఎదో ప్లాన్ వేస్తూ యాత్రని డైవెర్ట్ చేయాలనీ అనుకున్నా సరే బాబు కి ఆది సాధ్య పడలేదు దాంతో చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు.

టీడీపీకి ఎంతో పట్టు ఉన్న పశ్చిమ ,తూర్పు జిల్లాలలో జగన్ కి పెరిగిన ఫాలోయింగ్ చూసి ఒక్క సారిగా షాక్ తిన్న బాబు తెలుగుదేశం పార్టీ ని ప్రజలలోకి మరింతగా తీసుకెళ్ళడానికి వచ్చే ఎన్నికల్లో గెలుపు గుర్రం ఎక్కానికి ఒక వ్యూహాన్ని సిద్దం చేశారు..ఇప్పటివరకూ చంద్రబాబు తాను పాల్గొంటున్న ప్రభుత్వ కార్యక్రమాలనే ఎన్నికల ప్రచారపర్వానికి ఉపయోగించుకుంటూ తన అభివృద్ధి పనులే విజయమంత్రంగా భావిస్తూ జనాలకు దగ్గరవుతున్నాడు. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం ఇప్పటి వరకు ఎటువంటి ప్రచార కార్యక్రమాలు నిర్వహించలేదు..అందుకే

రాష్ట్రంలోని 13 జిల్లాలలో 75 బహిరంగ సభలను నిర్వహించి ప్రజలకు మరింతా చేరువకావాలని బాబు ప్లాన్ చేశారు….ఈ మేరకు పార్టీ వర్గాలు కూడా ఇదే విషయాన్ని చర్చించుకుంటున్నాయి. ముఖ్యంగా రైతులే తమ టార్గెట్లుగా పెట్టుకోవాలని చంద్రబబు నేతలకుఅ సూచించారు ఎందుకంటే గత ఎన్నికల్లో రైతుల ఓట్లే కీలకం గా మనల్ని గెలిపించాయి కాబట్టి టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ అంశాన్ని బాగా హైలైట్ చేయాలని బాబు చెప్పినట్లు సమాచారం..అంతేకాదు టీడీపీ హయాంలో పూర్తియిన ప్రాజెక్ట్ లు మరియు వాటి వల్ల రైతులకి కలుగుతున్న లాభాలు తెలియచేయాలని ఆదేశించారట.

అంతేకాదు ఈ సభలని నిర్వహించడానికి నియోజకవర్గ ఇంచార్జ్ లని నియమించారు..నలభై ఐదు రోజులకోసారి ఇన్ ఛార్జీల పనితీరు, వ్యవహారశైలిపై కార్యకర్తల అభిప్రాయం తీసుకుంటారు…వారి పని తీరు బాగుంటే వారిని కొనసాగిస్తారు లేదంటే వేరే వాళ్ళని పెట్టి మరీ అనుకున్న కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తీ చేస్తారని అంటున్నారు..జగన్ చేస్తున్న పాదయాత్రకు ధీటుగా, ప్రజలు చిరకాలం గుర్తుంచుకునేలా ఈ సభలను నిర్వహించాలని ఎక్కడ లోపాలు జరిగిన మీలో మీరు కుమ్ములాటలు చేసుకుని పార్టీ పరువు బజారుకి ఈడ్చినా వారిపై తీవ్రమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారట చంద్రబాబు.