చంద్రబాబు వ్యూహాత్మక అడుగు ..మోడీ,షా లకి వెన్నులో వణుకు

దేశంలో మోడీ పేరు చెప్తేనే ఒక ప్రభంజనం, దేశ విదేశాలలో సైతం భారతీయులు మోడీ కి బ్రహ్మరధం పట్టారు.మోడీ పేరు వింటే చాలు ఎక్కడా లేని హోరు నినాదాలు వినిపించేవి అయితే ఇదంగా గతం ఏపీ సీఎం చంద్రబాబుని డీ కొట్టక ముందు జరిగిన హడావిడి తతంగం.

 Chandrababu Shocking Decision On May 7th-TeluguStop.com

ఎప్పుడైతే ఏపీ పై సవతి తల్లి ప్రేమ మోడీ చూపించాడో అప్పుడే మోడీ ఫ్యూచర్ తలపండిన ,చంద్రబాబు గురించి తెలిసిన మేధావులకి అర్థం అయ్యింది.ఎంతో మంది సీనియర్ నేతలు బీజేపి చంద్రబాబు తో వైరం వద్దని వారించినా సరే మోడీ ,షా లకి చెవికెక్కలేదు ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నారు.కట్ చేస్తే


ఏపీ ప్రజలని మోసం చేసి, నయవంచన చేసి ఇచ్చిన హామీలని తుంగలోకి తొక్కితే సామాన్య ప్రజలకి చిర్రెత్తుకొస్తుంది మరి అలాంటిది ఏపీ సీఎం చంరబాబు నాయుడుకి ఇంకెంత కోపం రావాలి.అందుకే అప్పటిదాకా మౌనంగా ఉన్న చంద్రబాబు ఎత్తులకి పై ఎత్తులు వేస్తూ వచ్చారు.దాంతో మోడీ షా ద్వయం ఉక్కిరిబిక్కిరి అవుతోందని తెలుస్తోంది.ఇప్పటికే దక్షినాది రాష్ట్రాలని ఒక్క తాటిపైకి తెచ్చిన చంద్రబాబు ఇప్పుడు మిగిలిన రాష్ట్రాల నేతల్ని కూడా ఒకే వేదికపైకి తీసుకురావాలని చూస్తున్నారు.

అందు కోసమే “మే 7” ని ఎంచుకున్నారు ఇప్పుడు “మే 7” అనే పేరు మోడీ కి నిద్రపట్టకుండా చేస్తోందని టాక్ వినిపిస్తోంది.

అయితే ఇక్కడ అందరికీ వచ్చే సందేహం ఏమిటంటే మోడీ షా లు ఎందుకు “మే 7” అంటే భయపడుతున్నారు రీజన్ ఏమయ్యి ఉంటుంది అనేకదా.

ఎందుకంటే “మే 7” న చంద్రబాబు బీజేపీ యేతర శక్తులు అందర్నీ ఒక్క చోటికి చేర్చుతున్నాడు అయితే సరిగ్గా కర్ణాటక లో ఎన్నికల హడావిడి వెరసి ఈ మీటింగ్ ఎఫెక్ట్ అంతా జరగబోయే ఎన్నికలపై ప్రభావాన్ని చూపించేదిగా ఉంటుంది అంతే కాదు, బీజేపీ యేతర రాష్ట్రాలను చంద్రబాబు ఏకం చేస్తే, చంద్రబాబు ఇమేజ్ పెరిగిపోతుంది కూడా…అయితే మొదటి మీటింగ్ లోనే బీజేపి పై శివాలెత్తిన బిజెపి వ్యతిరేక పార్టీల ఐక్యతతో బీజేపీకి వెన్నులో వణుకు మొదలయ్యింది.


అయితే ఈ సారి నిర్వహించే మీటింగ్ వేదికని విజయవాడకి మార్చాలని నిర్ణయం తీసుకున్నారట.

అంతేకాదు బిజెపి పాలిత వ్యతిరేకులే కాకుండా బీజేపి ని వ్యతిరేకించే వాళ్ళు అందరూ కూడా దక్షిణాది రాష్ట్రాల ఆర్థిక మంత్రులు ఇటీవల తిరువనంతపురంలో భేటీ కాగా, రెండో భేటీని విజయవాడ వేదికగా నిర్వహించాలని నిర్ణయించారు.అయితే ఈసారి దేశంలోని అన్ని బీజేపి యేతర శక్తులని ఒకే వేదిక పైకి తీసుకువచ్చి పోరాటాన్ని ఉధృతం చేయాలని సంకల్పించారు.

ఈ బాధ్యతను ఎపి రాష్ట్ర ఆర్థిక శాఖకు అప్పగించారు…అయితే ఆర్ధిక శాఖ ఈ మీటింగ్ ని పక్కా ప్రణాళికతో నడపనుంది


ఈ భేటీకి ఈ సారి ఢిల్లీ, పంజాబ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, మిజోరాం రాష్ట్రాలను కూడా ఆహ్వానించాలని నిర్ణయించారు.బీజేపి ఆధారిత రాష్ట్రాలగా లేని వార్తిని కూడా ఎంపిక చేసి వారిని కూడా ఈ మీటింగ్ కి పిలవాలని డిసైడ్ అయ్యారు అయితే ఎప్పటికప్పుడు ఇంటిలిజన్స్ ద్వారా సమాచారం అందుకుంటున్న కేంద్రం ఎలా అయినా సరే మీటింగ్ సక్సెస్ అవ్వకుండా విశ్వప్రయత్నాలు చేస్తోందట.

ఒక వేళ ఈ మీటింగ్ జరిగి సక్సెస్ అయితే మాత్రం మోడీ కి కర్ణాటక లో భారీ దెబ్బ తగిలే అవకాశం ఉందని అంటున్నారు.విశ్లేషకులు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube