త్వరలో మంత్రి వర్గ విస్తరణ..? చంద్రబాబు వ్యూహాత్మక నిర్ణయం..   Chandrababu Shocking Decision.. AP Cabinet Expansion     2018-04-07   02:20:37  IST  Bhanu C

ఏపీ క్యాబినెట్ విస్తరణ జరుగనుందా..? ఏపీలో ఇప్పుడు ఉన్న పరిస్థితుల దృష్ట్యా చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకుంటారా..? విస్తరణ జరిగితే ఎవరు ఉంటారు..? ఎవరు ఊడిపోతారు..? ఇప్పుడు ఈ ప్రశ్నలు రాజకీయ వర్గాలలో హల్చల్ చేస్తున్నాయి. ఒక పక్క ఏపీ అధికార పార్టీ అధ్యక్షుడు కేంద్రంపై పోరుబాట చేస్తూ ఢిల్లీ చుట్టూ తిరుగుతూ ఎంపీలకి దిశానిర్దేశం చేస్తూ క్షణం కూడా కాళీ లేకుండా ఉన్నారు…ఈ సమయంలో చంద్రబాబు మంత్రి వర్గ విస్తరణ అసలు చేపడుతారా అనే అనుమానాలు లేకపోలేదు..ఇప్పుడు గనుక విస్తరణ లేకపోతే తెలుగుదేశం పార్టీ తీవ్రంగా నష్ట పోవడం ఖాయం అనే వాదన కూడా వినిపిస్తోంది..

అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు త్వరలోనే మంత్రివర్గ విస్తరణ చేపడతారని..స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌కు మంత్రి పదవి ఇస్తారని…విస్తరణలో భాగంగా తప్పకుండా ఏపీలో భారీ మార్పులు ఉంటాయనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి అయితే ఈ విషయంపైనే గుంటూరు జిల్లా పార్టీ నేతలు మరో విధంగా స్పందిస్తున్నారు ఇప్పట్లో విస్తరణ జరిగే అవకాశం లేదని అంటున్నారు…ఈ విషయంపై కొంతమంది కావాలని పుకార్లు పుట్టిస్తున్నారని అంటున్నారు , మరి కొందరు నేతలు..అయితే ఇదే విషయంపై లోకేష్ ని కొంతమంది నేతలు అడిగినా సరే లోకేష్ ఈ వ్యాఖ్యలపై స్పందించలేదని అన్నారు..


అయితే లోకేష్ మాట్లాడుతూ ఇప్పటికే ఖాళీగా ఉన్న దేవాదాయశాఖను కె.ఇకి కే.ఈ కి అప్పగించాము మరొక వైద్య శాఖని ‘కిమిడి’కి ఇచ్చే ఉద్దేశ్యంతో చంద్రబాబు ఉన్నారని ఒక వేళ ఇవ్వకపోయినా సరే ఆ శాఖని చంద్రబాబు చూసుకుంటారు అని అన్నారట..అయితే మంత్రి వర్గ విస్తరణ జరిగితే మాత్రం..కొంతమందిని తొలగించడం ఖాయం అని వారిలో మొదటి వరుసలో పశ్చిమకి చెందిన మంత్రి ఒకరు ఉన్నారని..తరువాత కృష్ణా జిల్లా నుంచీ ఒకరు..కడప జిల్లా నుంచీ మరొకరు ఉన్నారనే టాక్ వినిపిస్తోంది..తూర్పు గోదావరి నుంచీ ఒక ఫిరాయింపు ఎమ్మెల్యే ని మంత్రి వర్గంలోకి తీసుకునే అవకాశం ఉందని ఈ విషయంపై చంద్రబాబు క్లారిటీ తో ఉన్నారని వినిపిస్తోంది..అయితే చంద్రబాబు ఈ విషయాలని గతంలోనే చర్చించారని అయితే ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా మంత్రివర్గ విస్తరణ జరుగుతుందా లేదా అనేది చంద్రబాబు నిర్ణయంపై ఆధారపడి ఉందని..విస్తరణ జరిగే దానికంటే జరగక పోవడమే పార్టీకి మంచిదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు మరి కొందరు నేతలు..ఏది ఏమైనా చంద్రబాబు ఈ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే..