“జూన్” తరువాత “కీలక పరిణామాలు”...చంద్రబాబు “షాకింగ్ కామెంట్స్”       2018-05-12   00:52:00  IST  Bhanu C

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిన్నటి టీడీఎల్పీ సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు..తెలుగుదేశం పార్టీ వచ్చే ఎన్నికల్లో గెలిచి తీరాలి అంటూ నేతలకి చెప్పారు..వచ్చే ఎన్నికల వరకూ కూడా నేతలు ఎవరూ విరామం తీసుకోవద్దని తెలిపారు…కార్యకర్తల సేవలని ఉపయోగించుకోవాలని..నేతల మధ్య సమన్వయ లోపాలు ఉంటే కలిసి కూర్చుని సామరస్యంగా పరిష్కరించుకోలని తెలిపారు..ఇప్పుడు ఏపీలో టీడీపీ పార్టీ గెలవడం అనేది ఒక చారిత్రిక అవసరమని తెలిపారు చంద్రబాబు నాయుడు..అయితే

పార్టీ లో గొడవలు పడి కీలక సమయంలో పార్టీ పరువుని రోడ్డున పడేసే నేతలపై తీవ్రమైన చర్యలకు తీసుకుంటానని హెచ్చరించారు..ప్రత్యేక హోదా కోసం పోరాటం చేసిన ఒకే ఒక్క పార్టీ టీడీపీ అని ఇదే ప్రజలు కూడా విస్వసిస్తున్నారని తెలిపారు..జగన్ బీజేపీతో లాలూచి పడి తన ఎంపీల ద్వారా రాజీనామాలు చేయించి తద్వారా లబ్ది పొందాలని ప్రయత్నాలు చేశారు కానీ ప్రజలు వాటిని నమ్మలేదు..ప్రజలు టీడీపీ కి అనుకూలంగా ఉన్నారని అన్నారు..

అయితే వైసీపి ఎంపీలు చేసిన రాజీనామాలను జూన్ 2వ తేదీ తర్వాత ఆమోదించే అవకాశం ఉదని చెప్పారు…దీని తరువాత ఉప ఎన్నికలు రానున్నాయని దాంతో టీడీపీ సత్తా ఏమిటో అప్పడు చూపుతామని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు..అయితే ఈ సమయంలోనే తెలంగాణలో 25 స్థానాలకి ఉప ఎన్నికలు జరిగినపుడు వాటిలో 7 స్థానాలు టీడీపీ గెలుచుకుందనే విషయాన్ని గుర్తుచేశారు..అయితే ఉపఎన్నికలు ఎప్పుడు వచ్చిన సరే తప్పకుండా టీడీపీ ఆ స్థానాలు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు..

ఏపీలో మన ప్రభుత్వం పేద ప్రజలకోసం ఏర్పాటు చేసిన పధకాల వలన లబ్ది పొందినవారు ఎంతో మంది ఉన్నారని 75 శాతం మంది ప్రజలు ఈ పదకాల విషయంలో సంతృప్తి వ్యక్తం చేశారని అన్నారు..జిల్లా వ్యాప్తంగా చేస్తున్న యాత్రలు ప్రజలలో నమ్మకాన్ని పెంచాయని..మనం తెలిపిన నిరసనలు ప్రజలకి మనద్వారానే హోదా సాధ్యం అనే నమ్మకాన్ని కలిగించాయని అన్నారు చంద్రబాబు నాయుడు..అంతేకాదు..కార్యకర్తలని విస్మరిచే నాయకులపై చర్యలు తీసుకోవడానికి సైతం వెనుకాడనని తెలిపారు చంద్రబాబు..అయితే పార్టీ లో కష్టపడి చేసే వారికి తప్పకుండా భవిష్యత్తు ఉంటుందని తెలిపారు.