చంద్ర‌బాబుకు షాక్‌: టీడీపీలో 2 బిగ్ వికెట్స్ డౌన్‌     2016-12-21   04:37:18  IST  Bhanu C

ఏపీ సీఎం చంద్ర‌బాబుకి కొద్ది రోజుల్లోనే బిగ్ షాక్ త‌గ‌ల‌నుందా ? వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుపుకోసం విప‌క్ష వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీల‌ను వ‌రుస‌పెట్టి త‌న పార్టీలో చేర్చుకుంటున్న చంద్ర‌బాబ‌కు త‌న పార్టీకే చెందిన ఓ ఎంపీ, ఎమ్మెల్యే బిగ్ షాక్ ఇవ్వ‌నున్నారా ? అంటే ఏపీ పొలిటిక‌ల్ కారిడాల్‌లో జ‌రుగుతోన్న చ‌ర్చ‌లు అవున‌నే అంటున్నాయి.

అనంత‌పురం ఎంపీ జేసీ దివాక‌ర్‌రెడ్డి, ఆయ‌న సోద‌రుడు తాడిప‌త్రి ఎమ్మెల్యే జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి ఇప్పుడు టీడీపీలో పెద్ద అసంతృప్తి వాదులుగా మారారు. దివాక‌ర్‌రెడ్డి ప్ర‌తిసారి టీడీపీతో పాటు చంద్ర‌బాబుపై కాంట్ర‌వర్సీ కామెంట్లు విసురుతున్నారు. చంద్ర‌బాబు మాత్రం జేసీ దివాక‌ర్‌రెడ్డి సీనియారిటీ దృష్ట్యా ఆయ‌న‌కు గౌర‌వం ఇస్తున్నా జేసీ మాత్రం త‌న కాంట్ర‌వ‌ర్సీ కామెంట్లు ఆప‌డం లేదు.

తాజాగా అనంత‌పురంలో జేసీ మ‌రోసారి చంద్ర‌బాబుపై కాంట్ర‌వర్సీ కామెంట్లు చేసి బాబు ప‌రువు నిలువునా తీసేశారు. చంద్ర‌బాబు వ‌ల్లే టీడీపీ అధికారంలోకి రాలేద‌న్న ఆయ‌న.. టీడీపీలో ప్ర‌తి ఒక్క‌రూ క‌లిసి కృషి చేస్తేనే పార్టీ అధికారంలోకి వ‌చ్చింద‌న్నారు. చంద్ర‌బాబు ఏమీ గాంధీ కాద‌ని… కూడా జేసీ చెప్పారు. ఈ వ్యాఖ్య‌లు విన్న టీడీపీ నేత‌లు క‌రెంటు షాక్ కొట్టిన వాళ్ల‌లా మాడిపోయారు. జేసీపై ఎంత కోపం ఉన్నా సీనియ‌ర్ కావ‌డంతో వారు జేసీని గ‌ట్టిగా ఏమీ అన‌లేక‌పోతున్నారు.

అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే జేసీ బ్ర‌ద‌ర్స్‌కు పైకి ఎలా ఉన్నా రాజ‌కీయంగా మాత్రం చంద్ర‌బాబు పూర్తిగా ప్ర‌యారిటీ త‌గ్గించేశార‌ని తెలుస్తోంది. ఇక జేసీ ప‌దే ప‌దే అనంత‌పురం ఎమ్మెల్యే ప్ర‌భాక‌ర్ చౌద‌రితో గొడ‌వ‌కు దిగుతున్నారు. ఇది కూడా వ‌చ్చే ఎన్నిక‌ల్లో అనంత‌పురం అసెంబ్లీ సీటును త‌న కుమారుడికి ఇప్పించుకునే క్ర‌మంలోనే కావాల‌నే అక్క‌డ ర‌చ్చ చేస్తున్నారే ఫిర్యాదు చంద్ర‌బాబు వ‌ద్ద‌కు సైతం వెళ్లింది. దీంతో బాబు జేసీ బ్ర‌ద‌ర్స్‌కు పొలిటిక‌ల్ ప్ర‌యారిటీ త‌గ్గించేశారు.

ఈ క్ర‌మంలోనే ఇక్క‌డ కొద్ది రోజుల పాటు ఉండి టీడీపీ, చంద్ర‌బాబును నానా మాట‌లు అనేసి రెస్పాన్స్ రాక‌పోతే వైసీపీలోకి జంప్ చేసేయాల‌ని జేసీ బ్ర‌ద‌ర్స్ చూస్తున్నార‌ట‌. జ‌గ‌న్ త‌మ‌కు గేట్లు ఎప్పుడూ తెరిచే ఉంచుతార‌ని కూడా ఈ బ్ర‌ద‌ర్స్ త‌మ అనుచ‌రుల‌తో అంటున్నార‌ని టాక్‌. జేసీ బ్ర‌ద‌ర్స్ త‌మ పార్టీలోకి వ‌స్తే అనంత‌లో టీడీపీకి గ‌ట్టి పోటీ ఇస్తామ‌నే భావ‌న‌లో జ‌గ‌న్ ఉన్నార‌ట‌.