న్యూస్‌ ఛానెల్స్‌ నిలిపేయడంపై బాబు సీరియస్‌

ఏపీలో ఏబీఎన్‌తో పాటు కొన్ని న్యూస్‌ ఛానెల్స్‌ ప్రసారాలను అనధికారికంగా నిలిపేయాలని మంత్రులు మరియు ముఖ్యమంత్రి ఆఫీస్‌ నుండి ఆదేశాలు వెళ్లాయంటూ తెలుగు దేశం పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు.వైకాపా నాయకులకు వ్యతిరేకంగా కథనాలు ప్రసారం చేసినందుకు ఆ ఛానెల్స్‌పై కక్ష సాధిస్తున్నట్లుగా తెలుగు దేశం పార్టీ విమర్శలు చేస్తోంది.

 Chandrababu Serious On Ap Cm Jagan Mohan Reddy-TeluguStop.com

పల్నాడులో జరిగిన హింసను కవరేజ్‌ చేసిన కారణంగానే ఆ మీడియా ఛానెల్స్‌ పై ఈ చర్యలు తీసుకున్నట్లుగా వారు అంటున్నారు.

ఈ విషయమై చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.

రాష్ట్రంలో కొన్ని ఛానెల్స్‌ ప్రసారాలను నిలిపేసినట్లుగా నాకు సమాచారం అందింది.స్వయంగా మంత్రులు కేబుల్‌ ఆపరేటర్‌లకు ఫోన్స్‌ చేసి మరీ ఆ ఛానెల్స్‌ను నిలిపేయాలంటూ ఆదేశాలు జారీ చేసినట్లుగా తన దృష్టికి వచ్చిందని, ఇది ఏమాత్రం కరెక్ట్‌ కాదని బాబు అన్నాడు.

తాము ఏ ఛానెల్స్‌ చూడాలి అనేది వినియోగదారుల ఇష్టం.దాన్ని కాదనే హక్కు ఎవరికి లేదు.

అలా చేయడం ట్రాయ్‌ నిబంధనలకు విరుద్దం.అసెంబ్లీలో ప్రతిపక్షం గొంతు నొక్కిన విధంగానే మీడియా గొంతు నొక్కేందుకు ఈ విద్యమైన అనధికారిక చర్యలు తీసుకుంటున్నారు అంటూ చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో మండి పడ్డాడు.

ఈ విషయమై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు సిద్దం అవుతామని తెలుగు దేశం పార్టీ నాయకులు హెచ్చరించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube