తనపైన కుట్ర జరుగుతుంది అంటూ సంచలన వాఖ్యలు చేసిన చంద్రబాబు  

ఏపీ సిఎస్ ని బదిలీ చేసిన ఎన్నికల సంఘం. ఘాటుగా విమర్శించిన చంద్రబాబు. .

Chandrababu Sensational Comments On Bjp-ap Politics,bjp,chandrababu Sensational Comments,janasena,tdp,ysrcp

ఏపీలో ఎన్నికల పోరు జోరుగా సాగుతుంది. ప్రధాన పార్టీలు అన్ని ఒకరి మీద వ్యూహ, ప్రతివ్యూహాలతో ఎన్నికల రణరంగంలో సత్తా చాటే ప్రయత్నం చేస్తున్నారు. ఏ చిన్న అవకాశం వచ్చిన ప్రత్యర్ధి పార్టీలని ఇరుకున పెట్టి లబ్ది పొందే ప్రయత్నం మూడు పార్టీలు చేస్తున్నాయి..

తనపైన కుట్ర జరుగుతుంది అంటూ సంచలన వాఖ్యలు చేసిన చంద్రబాబు-Chandrababu Sensational Comments On BJP

ఇక టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు తన రాజకీయ చతురతని పదును పెట్టి ఎన్నికలలో దూసుకుపోతున్నారు. ప్రజాక్షేత్రంలో తన తన ఆలోచనలతో ప్రజలని ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తున్నారు.

ఇదిలా ఉంటే ఏపీలో చంద్రబాబుని నిలువరించడానికి ఓ వైపు ప్రతిపక్ష వైసీపీ, అలాగే కేంద్రం బీజేపీ, టీఆర్ఎస్ పార్టీ కూడా వ్యూహాలు సిద్ధం చేసుకున్నాయి.

తాజాగా వైసీపీ పార్టీ ఏపీ ఇంటలిజెన్స్ అధికారి మీద ఫిర్యాదు చేయడంతల్ ఎన్నికల సంఘం అతనిని బదిలీ చేసింది. అలాగే శ్రీకాకుళం, కడప ఎస్పీలని కూడా కూడా బదిలీ చేసారు. ఇదంతా తనకి వ్యతిరేకంగా జరుగుతున్నా కుట్ర అని బాబు తీవ్ర ఆరోపణలు చేసారు.

తాజాగా ఏపీ ఎన్నికల కమిషన్ తాజాగా ఏపీ చీఫ్ సెక్రటరీ అనిల్ చంద్ర పునేఠాను కూడా ఎన్నికల సంఘం బదిలీ చేసింది. ఆయన స్థానంలో ఎల్వీ సుబ్రమణ్యంను నియమించింది. దీనిపై చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. ‘ఏ తప్పూ చేయని సీఎస్‌ను మార్చారు.

ఇంటెలిజెన్స్ డీజీని బదిలీ చేశారు. రేపో ఎల్లుండో నన్ను కూడా అరెస్ట్ చేసే ప్రయత్నం కేంద్రంలో బీజేపీ పార్టీ చేస్తుంది. బీజేపీ పార్టీ మీద ఎదురుతిరిగాననే తనపై ఇన్ని రకాల కుట్రలు చేస్తున్నారని, తమ పార్టీ నేతలపై ఐటీ రైడ్స్ చేస్తూ ప్రజలలోకి తప్పుడు సంకేతాలు పంపిస్తున్నారని సంచలన విమర్శలు చేసారు..