బాబు చెప్పినట్లే జనాలు ఓట్లు వేసారంట! అందుకే టీడీపీ గెలుస్తుందంట  

టీడీపీ ఎలా అధికారంలోకి వస్తుందో చెప్పిన చంద్రబాబు. .

Chandrababu Says Tdp Will Be 200 Percent Win In Ap Elections-chandrababu,janasena,tdp Will Be 200 Percent Win,ysrcp

ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఏపీ అసెంబ్లీలో మరోసారి రాజకీయ వేడిని రాజేసాయి. ఒక్క లగడపాటి సర్వే, టీవీ 5 సర్వే తప్ప జాతీయ మీడియా సంస్థల నుంచి ఎన్నికల సర్వే సంస్థల వరకు అందరూ ఈ సారి వైసీపీ అధికారంలోకి వస్తుందని చెప్పుకొచ్చారు. అది కూడా వైసీపీ భారీ ఆధిక్యంతో ఈ సారి అధికారంలోకి రాబోతుంది అని సర్వేలలో తెలియజేసారు. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం ఎగ్జిట్ పోల్స్ సర్వేలపై అస్సలు విశ్వాసం చూపించడం లేదు..

బాబు చెప్పినట్లే జనాలు ఓట్లు వేసారంట! అందుకే టీడీపీ గెలుస్తుందంట-Chandrababu Says TDP Will Be 200 Percent Win In AP Elections

ఎన్నికలలో సర్వేల సంస్థలన్నీ వైసీపీకి అమ్ముడుపోయాయని అంటున్న టీడీపీ అధినేత ఫలితం తమ పార్టీకే అనుకూలంగా ఉండబోతుంది అని చెప్పుకొచ్చారు.

తాజాగా మీడియా సమావేశం ఏర్పాటు చేసిన చంద్రబాబు సర్వే ఫలితాలు గురించి మాట్లాడుతూ. ఏపీలో టీడీపీ మళ్ళీ 200 శాతం అధికారంలోకి రాబోతుందని, దీనిని ఎవరు ఆపలేరని చెప్పుకొచ్చారు. అంతటితో ఆగకుండా, ఏపీలో తాము ఎందుకు గెలుస్తాం అనేదానికి తనదైన శైలిలో విశ్లేషణ చేసారు.

ఏపీ ఓటర్లు అందరూ పోలింగ్ కేంద్రాలకి తరలి వెళ్లి, అభివృద్ధికి పట్టం కట్టాలని తాను ఇచ్చిన పిలుపు విని పెద్ద ఎత్తున జనం ఓట్లు వేసారని, అర్ధరాత్రి వరకు పోలింగ్ కేంద్రాలలో వెయిట్ చేసి ఓట్లు వేసారని చెప్పుకొచ్చారు. మొత్తానికి చంద్రన్న థియరీ విన్న ఎవరైన, చంద్రబాబు ఇంత భాగా దేనినైనా తనకి అనుకూలంగా మార్చుకోగాలరా అని మాట్లాడుకుంటున్నారు.