కేసీఆర్ పై చంద్ర‌బాబు సెటైర్..! అప్పుడేమో సైలెంట్ గా ఉన్నావ్...ఇప్పుడు జగన్ కి ఎందుకు ఫోన్ చేసావ్.?   Chandrababu Satire On KCR     2018-10-26   09:30:47  IST  Sainath G

ఏపీపై ఎలాంటి కుట్రలు జరుగుతున్నాయో విశాఖ ఎయిర్‌పోర్టు ఘటనతో తేలిపోయిందని సీఎం చంద్రబాబు అన్నారు. విశాఖ ఎయిర్‌పోర్టులో జగన్‌పై దాడి, అనంతరం జరిగిన పరిణామాలపై చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ ‘‘ దాడి జరిగిందని ఆరోపణలు చేసిన జగన్‌.. బాధ్యత లేకుండా హైదరాబాద్‌ వెళ్లిపోయారు. వాళ్లలో వాళ్లు దాడులు చేసుకున్నారు… డ్రామాలు ఆడారు. ఇదంతా జరిగిన వెంటనే డీజీపీకి గవర్నర్‌ ఫోన్‌ చేశారు. సుదీర్ఘకాలం సీఎంగా పనిచేశాను నేను.. ఏమనుకుంటున్నారు. జగన్‌పై దాడి జరిగిందంటూ పవన్‌ ఖండిస్తారు… కేటీఆర్‌ స్పందిస్తారు. దీంతో అందరూ ఏకమయ్యారని అర్థమవుతోంది.

ఆసుపత్రిలో చికిత్స తీరు తెన్నులను ఆయన అడిగి తెలుసుకొన్నారు. త్వరగా జగన్ కోలుకోవాలని ఆకాంక్షను కేసీఆర్ వ్యక్తం చేశారు. తగినంత విశ్రాంతి తీసుకోవాలని జగన్‌ను ఆయన కోరారు.తెలంగాణ రాష్ట్రంలోని కొండ‌గ‌ట్టులో ప్ర‌మాధం జ‌రిగి పేద తెలంగాణ ప్ర‌జ‌లు ప్రాణాలు కొల్పొతే క‌నీసం క‌న్నెత్తి చూడ‌ని కేసీఆర్.. జ‌గ‌న్ కు చిన్న గాయ‌మైతే.. కంగారుప‌డి రియాక్ట్ అయ్యారనీ బాబు కౌంటర్ వేశారు. తిత్లీ తుఫ‌న్ తీవ్ర న‌ష్టాన్ని మిగిల్చితే క‌నీసం స్పందించ‌ని కేసీఆర్ కుటుంబం.. జ‌గ‌న్ విష‌యంలో మూకుమ్మ‌డి ప‌రామ‌ర్శ‌లు చేస్తుంద‌నీ మూకుమ్మ‌డి ఒప్పందంలో బాగంగానే ఈ స్పంద‌న‌ల‌నీ చంద్ర‌బాబు చెప్పుకొచ్చారు.

Chandrababu Satire On KCR-

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.