'కథానాయకుడు' లో మీ పాత్ర ఎలా అనిపించిందన్న ప్రశ్నకు చంద్రబాబు ఏమన్నారో తెలుసా.?     2019-01-12   09:03:04  IST  Sai Mallula

నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో తెరకెక్కిన అన్న గారి జీవిత చరిత్ర “కథానాయకుడు” సినిమా ఇటీవలే విడుదలయ్యి హిట్ టాక్ సంపాదించుకున్న సంగతి అందరికి తెలిసిందే. సినిమా చూసిన వారందరు బాలయ్య గారు అన్న గారి లాగే ఉన్నారు అన్నారు. తెలుగు సినిమా రంగంలో గొప్ప హీరో అంటే ఇప్పటికి అన్న గారి పేరే చెబుతారు. అలాంటి అన్న గారు సినిమా రంగంలో ఎన్ని కష్టాలు పడ్డారు ఈ సినిమాలో చక్కగా చూపించారు.

ఇక మెయిన్ గా చెప్పుకోవాల్సింది చంద్రబాబు నాయుడు క్యారెక్టర్ చేసిన రానా గురించి. రానా చంద్రబాబు లాగ నటించి ప్రశంసలు అందుకున్నారు. ఇక ఈ సినిమా చూసిన చంద్రబాబు నాయుడు గారు ఏమని కామెంట్స్ చేసారంటే..?

Chandrababu Response On His Role In Ntr Bio Pic-Chandrababu N.T.R. Kathanayakudu NTR Pic Rana Daggupati

Chandrababu Response On His Role In Ntr Bio Pic

నటీనటులందరూ తమ పాత్రల్లో జీవించారని ప్రశంసించారు. సినిమాను క్రిష్ అద్భుతంగా తీశారని, బాలకృష్ణ బాగా నటించారని కొనియాడారు.పాత రోజులన్నీ గుర్తుకొస్తున్నాయని చంద్రబాబు పేర్కొన్నారు. ఎన్టీఆర్‌కు సంబంధించిన ఎన్నో విలువైన విషయాలను ఇందులో చూపించారని, ఈ సినిమా అందరికీ స్ఫూర్తినిస్తుందని అన్నారు. ప్రతి ఒక్కరు తప్పక చూడాల్సిన సినిమా ఇదని అన్నారు.

ఇది ఇలా ఉండగా సినిమాలో తన పాత్ర గురించి అడగగా…‘నా పాత్ర ఎలా ఉందన్నది నా కంటే మీరే బాగా చెప్పగలరు’ అని బదులిచ్చారు.

Chandrababu Response On His Role In Ntr Bio Pic-Chandrababu N.T.R. Kathanayakudu NTR Pic Rana Daggupati