చంద్రబాబు ప్రశ్నలకు ఆన్సర్ ఉందా...కెసిఆరూ..??

తెలంగాణలో ఎన్నికల ప్రచారం రక్తి కడుతోంది ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ తన ప్రచారాన్ని ఎప్పుడు ప్రారంభించిన సరే మొట్ట మొదటి మాట చంద్రబాబు నాయుడు పేరును స్మరిస్తూ రావటం అందరూ గమనిస్తున్న విషయం.తన ప్రసంగాలలో అధికశాతం చంద్రబాబు టార్గెట్ గా చేసుకుని , తెలంగాణ ద్రోహి, తెలంగాణ అభివృద్ధి కి అడుగడుగునా అడ్డు పడ్డాడు అంటూ కేసీఆర్ తనదైన తెలంగాణ భాషలో బాబు పై నిప్పులు చెరుగుతున్నారు.

 Chandrababu Questions To Kcr-TeluguStop.com

అయితే ఈ సందర్భంలోనే చంద్రబాబు సైతం టిఆర్ఎస్ అధినేత కేసీఆర్ కి దిమ్మ తిరిగిపోయేలా కొన్ని ప్రశ్నలను సంధించారు.తెలంగాణలో పలు జిల్లాల్లో పర్యటిస్తున్న చంద్రబాబుకి అక్కడ స్థానిక ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు.అంతేకాదు

చంద్రబాబు కెసిఆర్ కు సంధించిన ప్రశ్నలు తెలంగాణాలో ప్రతి ఒక్కరిని ఆలోచింపజేసేలా ఉన్నాయి.ఆంధ్ర వాళ్ళ పెత్తనం మనకి మళ్లీ కావాలా అంటూ కేసీఆర్ చంద్రబాబు ని విమర్శిస్తూ, తెలంగాణ ప్రజల సెంటిమెంట్ ను రగిల్చే ప్రయత్నం చేస్తున్నారు.అయితే కేసిఆర్ ఎన్ని వ్యాఖ్యలు చేసిన తన పని తాను చేసుకుపోతున్న చంద్రబాబు, మొదటిసారి ఖమ్మంలో జరిగిన ప్రజా కూటమి సభలో అశేష జనం హాజరైన సందర్భంలో కేసీఆర్ పై ప్రశ్నల వర్షం కురిపించారు.ఈ ప్రశ్నలతో కేసీఆర్ ఒకింత సందిగ్ధంలో పడటం ఖాయమని అంటున్నారు పరిశీలకులు.

ఇంతకీ బాబు సంధించిన ప్రశ్నలు వివరాల్లోకి వెళితే.

కెసిఆర్ తనని తెలంగాణ అభివృద్ధికి అడ్డుపడుతున్న ట్టుగా ప్రజల ముందు బూచిని చేసి చూపిస్తున్నారని.

అసలు హైదరాబాద్ ఇంతగా అభివృద్ధి చెందటానికి ఎవరు కారణంలో ప్రత్యేకించి చెప్పాలా అంటూ ప్రశ్నించారు.అంతేకాదు నేను తెలంగాణకు దళిత సీఎం ను చేస్తానంటే అడ్డుపడ్డానా.?? లేక డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టిస్తాం అంటే అడ్డుపడ్డానా.?? లేక దళితులకు మూడెకరాల భూమి ఇస్తానంటే అడ్డుపడ్డానా.?? బయ్యారంలో స్టీల్ ప్లాంట్లు పెడతానంటే అడ్డుపడ్డానా.?? అసలు ఏ విధంగా తెలంగాణ అభివృద్ధికి నేను అడ్డుపడ్డానో కేసీఆర్ చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

హైదరాబాదు ని నేను నిర్మించానని చెప్పలేదని కేవలం హైదరాబాద్ ప్రపంచంలో ఒక అగ్రగామి అభివృద్ధి చెందినా ప్రాంతంగా చేయాలని కృషి చేశానని.నేను ఎక్కడికి వెళ్ళినా ఇదే విషయం చెప్తున్నాను తప్ప నేనే హైదరాబాదు నిర్మించానని చెప్పలెదనీ బాబు కేసీఆర్ పై ఫైర్ అయ్యారు.అంతేకాదు ప్రపంచ పటంలో హైదరాబాద్ కు చోటు కల్పించడం నేను చేసిన తప్పా చెప్పండి తమ్ముళ్లు అంటూ చంద్రబాబు చేసిన ప్రసంగం పై తెలంగాణా ప్రజలు బాగానే కనెక్ట్ అయ్యారు.కేసీఆర్ ని ప్రశ్నిస్తున్న సమయంలో స్థానిక ప్రజల నుంచీ వచ్చిన స్పందన చాలు కేసీఆర్ పై వ్యతిరేకత ఉందని చెప్పడానికి అంటూ బాబు వ్యాఖ్యానించారు.

ఇదిలాఉంటే ఇరు పార్టీ నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం పరిపాటే అయినా చివరికి ప్రజలు ఎవరికీ ఓట్లు వేసి గెలిపిస్తారనేది వేచి చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube