‘ కరెంట్ ‘ పాలిటిక్స్ కరెక్ట్ టైమ్ లో అదిరిందయ్య బాబు  

Chandrababu Power Bills Ycp Tdp - Telugu Ap, Ap Power Bills, Chandrababu, Coronavirus, Lock Down, Tdp, Ycp

ఎక్కడ ఎప్పుడు ఏ ఎత్తుగడ వేస్తే రాజకీయంగా పైచేయి సాధించవచ్చు అనే విషయం టిడిపి అధినేత చంద్రబాబు కు బాగా తెలుసు. వైసీపీ ప్రభుత్వం ఏపీలో అధికారం చేపట్టిన తర్వాత ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేసుకుంటూ ప్రజల గుండెల్లో చెరగని ముద్రవేసింది.

 Chandrababu Power Bills Ycp Tdp

అయితే అనుకోకుండా కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించడం, ప్రజల రోజువారీ కార్యకలాపాలు ఎక్కడికక్కడ సమస్తం స్తంభించిపోయాయి.ప్రజలు ఆదాయం లేక అల్లాడే పరిస్థితి ఏర్పడింది.

ప్రభుత్వం నుంచి అరకొర సహాయం అందుతున్నా, జనాల్లో సంతృప్తి లేదు.సరిగ్గా ఇదే సమయంలో ఏపీలో విద్యుత్ బిల్లులు అధికంగా రావడం, ప్రజలకు తీవ్ర ఆగ్రహాన్ని కలిగించింది.

 కరెంట్ పాలిటిక్స్ కరెక్ట్ టైమ్ లో అదిరిందయ్య బాబు-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ఇదే విషయంపై తెలుగుదేశం పార్టీ నాయకులు ఇళ్ల వద్ద నిరసన దీక్షను చేపట్టారు.

ఇప్పుడు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఏపీకి వచ్చారు.ఇప్పుడు ప్రజల తరఫున పోరాడేందుకు చంద్రబాబు విద్యుత్ బిల్లు అంశం బాగా కలిసి వచ్చేలా కనిపిస్తోంది.ఇప్పటికే ప్రజల్లో ఆగ్రహాన్ని రాజకీయ ఆజ్యం పోస్తే వైసీపీ ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేయవచ్చనేది చంద్రబాబు ప్లాన్ గా తెలుస్తోంది.

అది కాకుండా ప్రజలు ఈ విషయం పై తీవ్ర ఆగ్రహం ఉండటంతో తెలుగుదేశం పార్టీపై సానుకూలత పెరుగుతుది అని బాబు భావిస్తున్నారు.అందుకే విద్యుత్ చార్జీలపై వైసీపీ ప్రభుత్వం గుక్క తిప్పుకోకుండా చేయాలని భావిస్తున్నారు.

కేవలం ఒకరోజు దీక్షలతో దీనిని సరిపెట్టకుండా, నిరంతరం కొనసాగే విధంగా ప్లాన్ చేసుకుంటున్నారు.

చాలా రోజుల తర్వాత ప్రత్యక్షంగా ప్రజా పోరాటం చేసే అవకాశం రావడంతో చంద్రబాబు దీనిని ఆషామాషీగా వదిలిపెట్టే అవకాశం కనిపించడం లేదు.రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున దీనిపై నిరసన కార్యక్రమాలు చేపట్టే విధంగా పార్టీ శ్రేణులకు సూచనలు ఇవ్వాలని ప్లాన్ చేసుకుంటున్నారు.అయితే ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం ఏ విధంగా తప్పించుకుందో చూడాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Chandrababu Power Bills Ycp Tdp Related Telugu News,Photos/Pics,Images..

footer-test