చంద్ర‌బాబు మాస్ట‌ర్ ప్లాన్‌.. వైసీపీకి చిక్కులు త‌ప్ప‌వా..

రాజ‌కీయాల్లో ఆయ‌న‌ది సుదీర్ఘ అనుభవం.వ్యూహాల‌కు ప్ర‌తి వ్యూహాలు ప‌న్న‌డంలో ఆయ‌న దిట్ట‌.

 Chandrababu Political Plan Against Ycp, Ys Jagan, Ycp Leaders, Tdp Leaders, Chan-TeluguStop.com

ఎలాంటి ప్ర‌తికూల ప‌రిస్థితుల్లో అయినా స‌రే త‌న‌కు అనుకూల వాతావ‌ర‌ణం సృష్టించుకో‌గ‌ల దిట్ట‌.అందుకే అంద‌రూ ఆయ‌న్ను వ్యూహ క‌ర్త అని పిలుస్తుంటారు.

ఇలాంటి కార్య‌క్ర‌మాల వ‌ల్లే చంద్రబాబు రాజకీయాల‌ను మ‌రో లెవెల్ లో చూస్తుంటారు విశ్లేష‌కులు.మొద‌టి నుంచి ఆయ‌న ఇలాంటి రాజ‌కీయాల‌తోనే త‌న హ‌వాను కొన‌సాగిస్తున్నారు.

అయితే ఇప్పుడు ఏపీలో ఆయ‌న‌కు ఎలాంటి ప్ర‌తికూల ప‌రిస్థితులు ఎదుర‌వుతున్నాయో చూస్తూనే ఉన్నాం.

మొన్న అసెంబ్లీలో జ‌రిగిన సంఘ‌ట‌న ఏపీ రాజ‌కీయాల‌ను కుదిపేసింది.

త‌న‌కు జ‌రిగిన అవ‌మానంపై ఆయ‌న తీవ్ర మ‌నోవేద‌న‌కు గుర‌య్యారు.తాను సీఎం అయిన త‌ర్వాతే మ‌ళ్లీ అసెంబ్లీలో అడుగు పెడ‌తాన‌ని శ‌ప‌థం చేసేశారు.

అయితే అప్ప‌టి నుంచే ఆయ‌న‌కు అన్ని వ‌ర్గాల నుంచి మ‌ద్ద‌తు పెర‌గ‌డం స్టార్ట్ అయిపోయింది.ఇక దాన్ని అనుకూలంగా మ‌లుచుకునేందుకు చంద్ర‌బాబు ఇప్పుడు మ‌రో ఎత్తుగ‌డ వేసేస్తున్నారు.

త‌న‌కు జ‌ర‌గిన అవ‌మానంపై, ఏపీ రాజ‌కీయాల‌ను లోక్ సభ, రాజ్యసభ‌ల్లో వినిపించేందుకు రెడీ అవుతున్నారు.

Telugu Chandrababu, Chandrababu Ycp, Tdp, Ycp, Ys Jagan-Telugu Political News

ఇందుకోసం ఇప్ప‌టికే టీడీపీ ఎంపీల‌కు దిశానిర్దేశం కూడా చేశారని తెలుస్తోంది.ఏపీలో వైసీసీ త‌మ మీద దాడులు చేస్తోందని, త‌మ పార్టీ ఆఫీసు మీద దాడులు, అలాగే అసెంబ్లీలో తన ఫ్యామిలీని అవ‌మానించ‌డం లాంటివి పార్లమెంట్ దృష్టికి తీసుకెళ్లాలంటూ ఆయ‌న ఆర్డ‌ర్ వేసేశారంట‌.దేశ అత్యున్న‌త స‌భ‌ల్లో వైసీపీకి చెక్ పెట్టాల‌ని చూస్తున్నారు చంద్రబాబు నాయుడు.

ఈ క్ర‌మంలోనే దేశ వ్యాప్తంగా వైసీపీ మీద వ్య‌తిరేక ప‌వ‌నాలు వ‌చ్చేలా చూడాలని చంద్రబాబు ప్లాన్‌.ఈ వ్యూహం ఫ‌లిస్తే మాత్రం జాతీయ మీడియాలో వైసీపీ హైలెట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.

మ‌రి ఈ ప్లాన్‌ను వైసీపీ ఎలా ఎదుర్కొంటుద‌నేది చూడాలి.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube