ఇక 'సైకిల్' ను నడిపించేది యువ నాయకులేనా ?

తెలుగుదేశం పార్టీ యువ నాయకత్వం కోసం ఆరాటపడుతోంది.ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ రాజకీయంగా అనేక ఇబ్బందులకు గురవుతోంది.

 Chandrababu Planto Give The Tdp Leadershipsin Tdp Youthleaders Andworkers-TeluguStop.com

అయినా చంద్రబాబు తన శక్తికి మించి పార్టీని ముందుకు నడిపించేందుకు ప్రయత్నిస్తున్నాడు.అయితే బాబు వయస్సు డెబ్భై దాటుతోంది.

ఆరోగ్య పరంగా ఆయన ఫిట్ గానే ఉన్నా ముందు ముందు ఇబ్బందికర పరిస్థితులు ఎదురవ్వవచ్చు.

Telugu Andhrapradesh, Chandrababu, Chandrababugive, Tdp, Lokesh, Tdp Run Tdp, Ys

 

ఇదే బెంగ తెలుగు తమ్ముళ్లలో కూడా ఆందోళన పెంచుతోంది.తెలుగుదేశం పార్టీ పరిస్థితి చూస్తే ఆ పార్టీలో మొత్తం వ్యవహారాలన్నీ బాబు కేంద్రంగానే జరుగుతాయి తప్ప అక్కడ మరో నాయకత్వం లేదు.మొదటి నుంచి ఇదే విధానాన్ని అలవాటు చేశారు.

అయితే ఇదే ఇప్పుడు ఆ పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది.చంద్రబాబు నాయకత్వ లక్షణాలను ఎవరూ తప్పుపట్టడంలేదు, తక్కువ చేయడంలేదు.

లోకేష్ ని బాబు భావి వారసునిగా చూపిస్తున్నా ఆయన నాయకత్వంపై ఆ పార్టీ నాయకులకే నమ్మకం లేదు.లోకేష్ ఇంకా ఓనమాలు దగ్గరే ఉండిపోయారు.

Telugu Andhrapradesh, Chandrababu, Chandrababugive, Tdp, Lokesh, Tdp Run Tdp, Ys

  మరో వైపు చూసుకుంటే టీడీపీలో ఉన్న సీనియర్ నాయకుల పరిస్థితి అదేవిధంగా ఉంది.అయిదేళ్ళు అధికారానికి దూరంగా ఉండాలంటే వారి వయసు కూడా ఎంతవరకు సహకరిస్తుందో తెలియని పరిస్థితి.అదే సమయంలో అప్పటి రాజకీయ పరిస్థితులు ఎలా ఉంటాయన్నది కూడా ఎవరికీ తెలియదు, ఇదే రకమైన ఆలోచనలతోనే ఇప్పటికే పార్టీ మారిపోయారు.ఇక ముందు కూడా ఇదే పరిస్థితి కొనసాగే పరిస్థితి నెలకొంది.

ఈ నేపథ్యంలో టీడీపీలో యువ నాయకత్వ బాధ్యతలు పెంచేందుకు చంద్రబాబు నిర్ణయం తీసుకున్నాడట.యువ నాయకత్వం లేకపోతే పార్టీ ముందు ముందు ఇబ్బందికర పరిణామాలను ఎదుర్కోవాలనే నిర్ణయానికి వచ్చారట.

ఈ నేపథ్యంలోనే పార్లమెంట్ వారీగా జిల్లా కమిటీలు నియమించేందుకు చంద్రబాబు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.ఈ కమిటీల్లో యువతకే ప్రాధాన్యం ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది.

Telugu Andhrapradesh, Chandrababu, Chandrababugive, Tdp, Lokesh, Tdp Run Tdp, Ys

  తెలుగుదేశం పార్టీలో యువ నాయకులు ఎక్కువమంది ఉన్నారు.సీనియర్ నాయకుల వారసులే చాలామంది తమ హవా చూపిస్తున్నారు.దీంతో చంద్ర బాబు రాజకీయ వారసులకే పగ్గాలు ఇస్తారా లేక పార్టీ కోసం అహర్నిశలు పనిచేసిన యువ నాయకులకు అవకాశం కల్పిస్తారా అనే అనుమానం అందరిలోనూ నెలకొంది.కింది స్థాయి నుంచి పని చేసుకుంటూ వచ్చిన వారికి అవకాశం ఇవ్వడం ద్వారా వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేస్తారని బాబు కి కొంతమంది సూచిస్తున్నారట.

అంతే కాకుండా పార్టీలో యువ నాయకత్వం పెరిగేలా సీనియర్ నాయకులతో ట్రైనింగ్ కూడా ఇప్పించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.ఏమైనా టీడీపీ లో యువ రక్తం ఎక్కిస్తే పార్టీని పరుగులు పెట్టిస్తారు అనడంలో సందేహమే లేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube