లోకేష్ ' సైకిల్ ' కు బాబు బ్రేకులు ?

ఒకవైపు టిడిపిలో చంద్రబాబు తన తనయుడు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రాధాన్యం పెంచుతూనే మరోవైపు దూకుడుగా ముందుకు వెళ్లకుండా చంద్రబాబు ఎప్పటికప్పుడు అడ్డుకట్ట వేస్తూ వస్తున్నారు.  రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ బరువు బాధ్యతలను లోకేష్ చూసుకోవాల్సిందే.

 Chandrababu Plans To Postpone Lokeshs Bicycle Tour Without Bothering To Ally Wit-TeluguStop.com

  ఇందులో ఎటువంటి సందేహం లేదు.దీని కోసమే ఆయనను పార్టీలో యాక్టివ్ చేసి కీలక నిర్ణయాలు అన్ని లోకేష్ తీసుకునే విధంగా చంద్రబాబు చేశారు.

దీని ద్వారా పార్టీలో లోకేష్ ప్రాధాన్యం పెరుగుతుందని,  నాయకులు ఆయనకు మరింత గౌరవ మర్యాదలు ఇస్తారనేది చంద్రబాబు అభిప్రాయం.వాస్తవంగా 2024 ఎన్నికల్లో పోటీ చేయకుండా లోకేష్ ను పోటీకి దింపడం వెనుక రాజకీయం నడిపించాలని చంద్రబాబు అభిప్రాయపడినా, ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఈ నిర్ణయం సరైంది కాదు అని  చంద్రబాబు ఒక అభిప్రాయానికి వచ్చేశారు.

     అందుకే చాలా జాగ్రత్తగా లోకేష్ ప్రాధాన్యం పెంచేందుకు ప్రయత్నిస్తున్నారని,  ఈ క్రమంలోనే లోకేష్ తో ఏపీ అంతటా సైకిల్ యాత్ర చేయించాలని చూసినా,  ఇప్పుడు ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారట.దీనికి కారణం ప్రస్తుతం టిడిపి ఎదుర్కొంటున్న ఇబ్బందులతో పాటు,  రాబోయే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసేందుకు సిద్ధంగా లేకపోవడం, ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకోవాలని చూస్తుండడం వంటి కారణాలతో లోకేష్ సైకిల్ యాత్ర కు బాబు బ్రేక్ వేశారు.
   

Telugu Chandrababu, Chandrababu Bus, Jagan, Janasena, Janasenani, Lokesh Cycle,

 ముఖ్యంగా జనసేన తో పొత్తు పెట్టుకునేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు ఇటువంటి సమయంలో లోకేష్  తో సైకిల్ యాత్ర చేయించి , ఆయన ప్రాధాన్యం మరింతగా పెంచితే పవన్ ఇబ్బంది పడతారని,  లోకేష్ కు మాత్రమే చంద్రబాబు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారనే అభిప్రాయం పవన్ లో రాకుండా చేసేందుకు బాబు ఈ నిర్ణయం తీసుకున్నారట.అందుకే ముందు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం బస్సు యాత్ర నిర్వహించి నియోజకవర్గాలను టిడిపి నేతలను యాక్టిిటీవ్ చేసే విధంగా ప్లాన్ చేసుకుంటున్నట్లు సమాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube