వారేనా టీడీపీ ని అధికారంలోకి తెచ్చేది ? 

తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు చేయని ప్రయత్నం అంటూ లేదు.2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఒంటరిగా పోటీ చేయడంతో అసలు సత్తా ఏమిటనేది అందరికీ అర్థమైపోయింది.మొదటి నుంచి టీడీపీకి అండదండలు అందిస్తూ వచ్చిన కొన్ని వర్గాలు దూరమైపోవడంతోనే 2019 ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవి చూడాల్సి వచ్చింది అనేది చంద్రబాబు కు అర్థమైంది.మళ్లీ ఆయా వర్గాల మద్దతు ఉంటే తప్ప అధికారంలోకి రాలేము అనే విషయాన్ని చంద్రబాబు గ్రహించారు.

 Chandrababu Plans To Launch A Farmer Movement To Get The Support Of Farmers For-TeluguStop.com

అందుకే తనకు దూరమైన ఒక వర్గాన్ని దగ్గర చేసుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు.ముఖ్యంగా రైతుల విషయంలో గతంలో చేసిన తప్పిదాల కారణంగానే 2019లో అధికారానికి దూరం అయ్యాము అనే విషయాన్ని చంద్రబాబు గ్రహించారు.
     2014 ఎన్నికల్లో రైతు రుణమాఫీ  అంశాన్ని ప్రస్తావించి టీడీపీ అధికారంలోకి వచ్చింది.  రుణమాఫీ పై తాను హామీ ఇవ్వను అంటూ జగన్ చెప్పడం తో టిడిపి వైపు అంతా మొగ్గు చూపించారు.

కానీ చంద్రబాబు అదే హామీతో అధికారంలోకి వచ్చారు.అయితే రుణమాఫీ ఒక్కసారిగా చేయకపోవడం దశలవారీగా చేపట్టడం, రైతుల ఖాతాల్లో సొమ్ములు వేసినా, అవి వడ్డీలకు సరి పోవడం ఎలా అనేక కారణాలతో చంద్రబాబు ప్రభుత్వం పై రైతులంతా ఆగ్రహంతోనే ఉన్నారు .ఆ ఫలితమే 2019 ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది.అయితే ఇప్పుడు రైతులను మచ్చిక చేసుకునేందుకు, వారి సహకారంతో అధికారంలోకి వచ్చేందుకు చంద్రబాబు ప్లాన్ చేసుకుంటున్నారు.
   

Telugu Ap Cm Jagan, Chandrababu, Farmers, Jagan, Ysrcp-Telugu Political News

 రైతుల తరపున ఉద్యమాలు చేపట్టాలని ప్లాన్ చేస్తున్నారు.భారీ వర్షాలు , తుఫాను కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని , అదికాకుండా కేంద్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన వ్యవసాయ చట్టాలకు అనుకూలంగా పార్లమెంట్ లో వైసిపి మద్దతు పలికిందని, రైతుల శ్రేయస్సును ఏ మాత్రం పట్టించుకోవడం లేదని అనేక ఆరోపణలు చేస్తూ రైతుల కోసం ప్రత్యేకంగా ఉద్యమాన్ని చేపట్టేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube