ఆ విధంగా టీడీపీ వారసుడు ఎవరో తేల్చేసిన బాబు ?  

Chandrababu Plans To Get Lokesh Future Leader Of Tdp - Telugu Chandrababu Plans, Future Leader Of Tdp, Nara Lokesh, Tdp Senior Leaders Sons

చాలా కాలంగా టిడిపి రాజకీయ వారసుడు ఎవరు అనేది క్లారిటీ లేకుండా పోయింది.ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకు వెళ్తూ వస్తున్న చంద్రబాబుకు వయసు పైబడటం తో పార్టీ పగ్గాలు ఎవరో ఒకరికి అప్పగించాల్సిన సమయం వచ్చేసింది.

 Chandrababu Plans To Get Lokesh Future Leader Of Tdp - Telugu Chandrababu Plans, Future Leader Of Tdp, Nara Lokesh, Tdp Senior Leaders Sons-Political-Telugu Tollywood Photo Image

అయితే ఎవరో ఒకరికి అనే ఆప్షన్ చంద్రబాబు ఎట్టిపరిస్థితుల్లోనూ ఇష్టపడడం లేదు.దీనికి కారణం తన తర్వాత తన వారసుడు లోకేష్ మాత్రమే టిడిపి పగ్గాలు చేపట్టాలని చంద్రబాబు భావిస్తున్నారు.

అయితే లోకేష్ నాయకత్వంపై తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబుకు అత్యంత సన్నిహితులైన వ్యక్తులు కూడా ఇష్టం లేదు.

ఆ విధంగా టీడీపీ వారసుడు ఎవరో తేల్చేసిన బాబు - Chandrababu Plans To Get Lokesh Future Leader Of Tdp - Telugu Chandrababu Plans, Future Leader Of Tdp, Nara Lokesh, Tdp Senior Leaders Sons-Political-Telugu Tollywood Photo Image

ఎందుకంటే లోకేష్ పనితీరు ఏ విధంగా ఉంటుంది అనేది అందరికీ బాగా తెలుసు.

అందుకే లోకేష్ నాయకత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకునేందుకు పార్టీ శ్రేణులు ఎవరు ఇష్టపడడం లేదు.దీంతో చాలా కాలంగా చంద్రబాబు ఇదే విషయమై బాధపడుతున్నట్లు కనిపించారు.ఏదో రకంగా లోకేష్ ను సమర్థవంతమైన నాయకుడిగా తీర్చిదిద్దేందుకు చంద్రబాబు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.గత టిడిపి ప్రభుత్వం లోనే లోకేష్ పెరిగేలా చంద్రబాబు వ్యవహరించారు.

ఆయనను ఎమ్మెల్సీ ని చేసి మంత్రిగా బాధ్యతలు అప్పగించారు.

>

సీఎంగా తానుండగా లోకేష్ పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ చక్రం తిప్పేలా చేశారు.

దీంతో చంద్రబాబు తర్వాత లోకేష్ అనే అభిప్రాయం జనాల్లోనూ, పార్టీ నాయకుల్లోనూ వచ్చేసింది.అయితే టిడిపి ప్రభుత్వం గద్దె దిగి జగన్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత టిడిపి సంక్షోభంలో కూరుకుపోయింది.

పార్టీ ని వీడి అనేకమంది సీనియర్ నాయకులు, ఎమ్మెల్యేలు బయటకు వెళ్లిపోయారు.అలా వెళ్లిన వారంతా ప్రధానంగా లోకేష్ ను టార్గెట్ చేసుకుని విమర్శలు చేయడంతో, లోకేష్ పరువు మరింత దిగజారింది.

అసలు తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపించేందుకు లోకేష్ ఏమాత్రం పనికిరాడనే అభిప్రాయం మరోసారి హైలెట్ అయింది.

అయితే తన తర్వాత లోకేష్ మాత్రమే రాజకీయ వారసుడు అవుతాడు అని పదేపదే చంద్రబాబు పార్టీ కీలక నాయకులు దగ్గర ప్రస్తావించారు.

ఈ సందర్భంగా చంద్రబాబు ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.ఇప్పుడు లోకేష్ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్న వారంతా పార్టీకి చెందిన సీనియర్ నాయకులు కావడంతో ఇక ముందు ముందు వారికి కూడా పెద్దగా ఉండే అవకాశం లేకపోవడంతో యువ నాయకత్వం చంద్రబాబు గురి పెట్టినట్లు తెలుస్తోంది.

ఆ మేరకు కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ లో టిడిపి సీనియర్ నాయకుల వారసుల కోసం ప్రత్యేకంగా ఓ విందు సమావేశం ఏర్పాటు చేశారు.ఆ సందర్భంగా లోకేష్ కు మీరంతా అండగా ఉండాలి అంటూ , వారి పూర్తి సహకారం ఉండేలా లోకేష్ కోసం ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

ఇక ముందు ముందు యువ నాయకులు అంతా లోకేష్ కు అండగా ఉంటూ లోకేష్ నాయకత్వాన్ని సమర్థించే విధంగా చంద్రబాబు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.అందుకే ఇక సీనియర్ నాయకులను పట్టించుకోకుండా యువ నాయకుల ద్వారా లోకేష్ నాయకత్వాన్ని బలపరిచి ముందు ముందు ఆయన పరపతి ఆ పార్టీలో ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

అంటే సీనియర్ నాయకులు సహకారం ఉన్నా, లేకపోయినా పర్వాలేదు అన్నట్టుగా చంద్రబాబు ఆలోచన తెలుస్తోంది.ఈ ఫార్ములాను సక్సెస్ చేసేందుకు చంద్రబాబు ఇప్పుడు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.

తాజా వార్తలు

Chandrababu Naidu Plans To Get Lokesh Future Leader Of Tdp Related Telugu News,Photos/Pics,Images..