ఆ విషయంలో జగన్ ని ఫాలో అవుతున్న చంద్రబాబు

తెలుగు రాష్ట్రాల చరిత్రలో సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా, రాజకీయాలో అపర చానిక్యుడుగా కీర్తించబడిన టీడీపీ అధినేత చంద్రబాబుకి ప్రస్తుతం గడ్డుకాలం నడుస్తుంది.ఎన్నడూ లేని విధంగా టీడీపీ పార్టీ గత ఎన్నికలలో ఘోర పరాజయాన్ని మూట గట్టుకుంది.

 Chandrababu Plan To Quit Assembly Seasons On Monday-TeluguStop.com

జగన్ ప్రభంజనం ముందు చంద్రబాబు అనుభవం ఏ మాత్రం పని చేయలేదు.జనసేన పార్టీ వైసీపీ ఓటు బ్యాంకుని కొంత చీల్చుతుందని భావించిన అది కాస్తా బాబుకి రివర్స్ కొట్టింది.

దీంతో కేవలం 23 స్థానాలకి టీడీపీ పరిమితం అయ్యింది.దీంతో ఇప్పుడు భారీ సంఖ్యలో ఎమ్మెల్యేలు ఉన్న వైసీపీ పార్టీ నేతలతో అసెంబ్లీ సమావేశాలలో వాదనలో పోటీ పడలేకపోతున్నారు.

ఓ విధంగా చూస్తే వైసీపీ నేతలందరూ చంద్రబాబుని లక్ష్యంగా చేసుకొని మూకుమ్మడిగా దాడి చేస్తున్నారు.

చివరికి వైసీపీ నేతలు వ్యక్తిగతంగా కూడా విమర్శలు చేస్తున్నారు.

గత టీడీపీ పాలనలో వైసీపీ మీద, జగన్ మీద ఆ పార్టీ నేతలు కూడా ఇలాగే వ్యక్తిగత దూషణలకి దిగడం, అసెంబ్లీలో మాట్లాడే అవకాశం లేకుండా ఎదురుదాడి చేయడం చేశారు.దీంతో జగన్ రెండున్నరేళ్ళలో అసెంబ్లీని వదిలి జనాల్లోకి వచ్చేశారు.

తరువాత వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరూ అసెంబ్లీ సమావేశాలలో పాల్గొనలేదు.ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం కూడా టీడీపీ మీద, చంద్రబాబు మీద అదే అస్త్రాలు ప్రయోగిస్తుంది.

ఎదురుదాడి చేసి వారికి మాట్లాడే అవకాశమే లేకుండా చేస్తున్నారు.దీంతో అసెంబ్లీ సమావేశాలకి డుమ్మా కొట్టే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నారని తెలుస్తుంది.

మూడు రాజధానుల బిల్లు తర్వాత రెండు రోజులు అసెంబ్లీ సమావేశాలకి వెళ్ళని చంద్రబాబు టీం సోమవారం కూడా వెళ్లకూడదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది.సోమవారం మండలి రద్దుపై చర్చించనున్న నేపధ్యంలో తమ వాయిస్ ని వినిపించే అవకాశం వైసీపీ ఎలాగూ ఇచ్చే అవకాశం లేదు కాబట్టి అసెంబ్లీ సమావేశాలకి వెళ్లకూడదని బాబు టీం నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది.

మొత్తానికి ఈ రెండు పార్టీల అధినేతలు అప్పుడు, ఇప్పుడు పాత్రలు మారిన ప్రయాణాలు మాత్రం ఒకే పంథాలో వెళ్తున్నాయని రాజకీయ వర్గాలలో చెప్పుకుంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube